హాలీవుడ్ రీమేక్ సినిమాలో ప్రభాస్ హీరోయిన్..?

Thu Jun 24 2021 08:00:01 GMT+0530 (IST)

Prabhas heroine in Hollywood remake movie

టాలీవుడ్ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత హీరోయిన్ కృతిసనన్ కెరీర్ అమాంతం మారిపోయింది. ఎందుకంటే టాలీవుడ్ లో సూపర్ మహేష్ బాబు సరసన డెబ్యూ చేసిన బ్యూటీ.. ఆ తర్వాత నాగచైతన్య సరసన దోచేయ్ సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు తెలుగులో అమ్మడికి హిట్స్ ఇవ్వలేకపోయాయి. ఎప్పుడైతే అలా బాలీవుడ్ లో అడుగుపెట్టిందో అప్పటినుండి కృతి కెరీర్ సుడి తిరిగిందనే చెప్పాలి. ఎందుకంటే కేవలం ఐదేళ్లలో అసలు ఊహించని రేంజిలో బిజీ అయిపోయింది. అందులోను చేతినిండా సినిమాలతో ఎవరికి దొరకట్లేదు.ఈ పొడుగుకాళ్ల ఢిల్లీ సుందరి.. ప్రస్తుతం చేతిలో పాన్ ఇండియా సినిమాలు కూడా కలిగి ఉంది. కానీ తాజాగా మరో హాలీవుడ్ రీమేక్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ లెక్కన కృతి కెరీర్ ఏ రేంజిలో దూసుకుపోతుందో అర్ధం చేసుకోవచ్చు. హాలీవుడ్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ క్వింటెన్ ట్యారంటీనో దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సక్సెస్ ఫిల్మ్ 'కిల్ బిల్'. 2003లో విడుదలైన ఈ క్లాసిక్ యాక్షన్ రివెంజ్ ఫిల్మ్.. హిందీలో నిఖిల్ ద్వివేది నిర్మించే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి బాలీవుడ్ రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

ఈ అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ చిత్రంలో ఉమా తుమ్రాన్ లీడ్ రోల్ పోషించింది. తాజా కథనాల ప్రకారం.. కిల్ బిల్ హిందీ రీమేక్ సినిమాను డైరెక్టర్ అనురాగ్ కష్యప్ తెరకెక్కించునున్నాడు. అలాగే ఈ సినిమాలో ఉమా తుర్మన్ పాత్రకోసం కృతిసనన్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. మరి చూడాలి కృతి ప్రస్తుతం ఉన్నటువంటి కమిట్మెంట్స్ ప్రకారం సినిమాను ఓకే చేస్తుందా లేదా అనేది. అలాగే ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీత క్యారెక్టర్ పోషిస్తుంది. అలాగే మరిన్ని సినిమాలు లైనప్ చేసింది. ప్రస్తుతం డైరెక్టర్ అనురాగ్ కష్యప్ కూడా దొబారా అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అనంతరం కిల్ బిల్ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉంది.