ప్రభాస్-రాజమౌళితో రానా లండన్ ఛలో

Thu Oct 10 2019 10:43:13 GMT+0530 (IST)

Prabhas To Be Live Streamed At The Royal Albert Hall In London

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు సాధించింది. ప్రపంచ విదేశాల్లో పలు సినిమా ఉత్సవాల్లో అరుదైన గౌరవం దక్కించుకుంది. తాజాగా మరో అరుదైన గౌరవం ఈ సినిమాకి దక్కనుంది. లండన్ రాయల్ ఆల్బర్ట్స్ హాల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు సాగుతున్న సంగతి తెలిసిందే.రాయల్ ఆల్బర్ట్స్ హాల్ లో బాహుబలి సినిమాను బ్రిటన్ కు చెందిన ప్రముఖ దిగ్గజాలు వీక్షించనున్నారు. అంతేకాదు అక్కడ షో ప్రదర్శనకు ముందు దర్శకుడు రాజమౌళితో లైవ్ చిట్ చాట్ జరగనుంది. ఈ స్పెషల్ ఈవెంట్ కు రాజమౌళితో పాటుగా ప్రభాస్- రానా- అనుష్క- తమన్నాహాజరవుతున్నారు. ఆస్కార్ చిత్రాలు.. పలు అంతర్జాతీయ సినీపండగల్లో అవార్డులు అందుకున్న క్రేజీ హాలీవుడ్ సినిమాల్ని మాత్రమే ప్రదర్శించే చోట ఒక తెలుగు సినిమాకి ఈ అవకాశం రావడం అన్నది చాలా అరుదు. ఆ ఛాన్స్ బాహుబలి దక్కించుకుంది.

ఈ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం పంపారు. ``బాహుబలి- ది బిగినింగ్` లైవ్ ఆర్కెస్ట్రాను లండన్ రాయల్ ఆల్బర్ట్స్ థియేటర్ లో పెర్ఫామ్ చేస్తున్నారు. నేను-రాజమౌళి- రానా అంతా లండన్ రాయల్ ఆల్బర్ట్స్ హాల్ కి వెళుతున్నాం. 19 అక్టోబర్ ఈవెంట్ కి మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్పేందుకు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నాను`` అంటూ ప్రభాస్ సందేశం పంపారు. హలో ఎవ్వెరి వన్ అంటూ సాహో స్టైల్ లో కనిపించాడు ఈ వీడియోలో. డార్లింగ్ ఇన్విటేషన్ అందుకుని మరి లండన్ అభిమానులు అక్కడికి అటెండ్ అవుతారేమో చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి