ప్రభాస్ 'స్పిరిట్'.. ఆ విషయం పుకార్లే పుకార్లు

Thu May 12 2022 22:00:01 GMT+0530 (IST)

Prabhas Spirit Movie

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవలే రాధేశ్యామ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ మరో వైపు ఆదిపురుష్ షూటింగ్ ను ముగించి వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కాకుండా ప్రభాస్ స్పిరిట్ సినిమాకు కూడా ఓకే చెప్పిన విషయం తెల్సిందే.అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందబోతున్న స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇప్పటి వరకు లేదు. సినిమా ను అధికారికంగా ప్రకటించిన తర్వాత మళ్లీ ఎలాంటి చిన్న విషయాన్ని కూడా యూనిట్ సభ్యులు రివీల్ చేయలేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి తోచిన విధంగా వారు పుకార్లు అల్లేసుకుంటున్నారు.

ప్రస్తుతం యానిమల్ సినిమా షూటింగ్ లో సందీప్ రెడ్డి వంగ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో ప్రభాస్ తో స్పిరిట్ మొదలు పెట్టే అవకాశం ఉంది. యానిమల్ షూటింగ్ కాస్త అటు ఇటు అయితే స్పిరిట్ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా లేక పోలేదు. ఈ సమయంలో సినిమా లో హీరోయిన్ పాత్ర గురించి దర్శకుడు సందీప్ వంగ ఆలోచించి ఉంటాడు అనుకోవడం లేదు.

కాని కొందరు మాత్రం స్పిరిట్ లో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీ మరియు రష్మిక మందన్నా లు పోటీ పడుతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. హిందీ అర్జున్ రెడ్డి కోసం కియారా అద్వానీతో సందీప్ వంగ పని చేశాడు. ప్రస్తుతం రష్మిక మందన్నాతో యానిమల్ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. కనుక వారిద్దరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా కియారా అద్వానీ అయితే బాగుంటుందని కొందరు భావిస్తూ ఉంటే.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పుష్ప తో మంచి పేరు దక్కించుకున్న రష్మిక మందన్నా అయితే స్పిరిట్ సినిమాకు కలిసి వస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమా గురించి పుకార్లే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.