బ్లాక్ బస్టర్.. ప్రభాస్ కి తలనొప్పిగా మారిందా?

Wed Jun 29 2022 08:00:01 GMT+0530 (IST)

Prabhas Salaar Movie

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన `కేజీఎఫ్ 2` ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల విడుదలై రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ క్రేజ్ ని సొంతం చేసుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లని రాబట్టింది. బాలీవుడ్ లో ఏకంగా రూ. 400 కోట్లకు మించి రాబట్టి ట్రేడ్ పండితుల్ని బాలీవుడ్ మేకర్స్ ని షాక్ కు గురిచేసింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి 1250 కోట్ల మేర వసూళ్లని రాబట్టి రికార్డు సృష్టించింది.ఇదే ఇప్పడు ప్రభాస్ కు తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద `కేజీఎఫ్ 2` రికార్డు స్థాయి విజయాన్ని సాధించి ట్రెండ్ సెట్ చేసింది. దీంతో ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రభాస్ మూవీపై మరింత ప్రెషర్ పడుతోందట. `కేజీఎఫ్ 2` ఓ రేంజ్ లో వుంది కాబట్టి అదే దర్శకుడి నుంచి రానున్న `సలార్` పై అంచనాలు భారీ స్థాయిలో వుంటాయన్నది అందరికి తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

దీంతో ప్రభాస్ నటిస్తున్న `సలార్` పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని అందుకోవడం ఇప్పడు ప్రభాస్ కు సవాల్ గా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా `కేజీఎఫ్ 2`తో పోలిస్తే `సలార్` భారీ స్థాయిలో తెరకెక్కుతోందని అంతకు మించిన విజయాన్ని ఈ మూవీ సాధించాల్సి వుంటుందని అయితే లార్జర్ దెన్ లైఫ్ మూవీగా రూపొందుతున్న`సలార్` ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే సమ్మర్ కు థియేటర్లలోకి రావడం కష్టమని 2024 లోనే ఈ మూవీ విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డిలే కూడా ప్రభాస్ కు పెద్ద హెడ్డేక్ గా మారుతోందని చెబుతున్నారు.

ప్రభాస్ నటించిన సాహో రాధేశ్యామ్ ప్రేక్షకులతో పాటు అభిమానుల్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో `సలార్`తో ఆ లోటుని భర్తీ చేసి భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నాడట. కానీ ఈ మూవీ మేకింగ్ పరంగా ఆలస్యం అవుతూ వస్తుండటంతో ఈ మూవీని 2024 లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.

మరీ ఇంత ఆలస్యం అవుతుండటంతో ప్రభాస్ మరింత ఇబ్బందిగా ఫీలవుతున్నాడని అయితే ఎంత డిలే అయినా ఈ మూవీ షూర్ షాట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం గ్యారంటీ అని ఇన్ సైడ్ టాక్. ఇక ఈ మూవీ రిలీజ్ డిలే కానున్న నేపథ్యంలో మధ్యలో మారుతి మూవీని రాకెట్ స్పీడుతో పూర్తి చేసి రిలీజ్ చేయాలా? లఏక `సలార్` పూర్తయ్యే వరకు ఏ ప్రాజెక్ట్ లోనూ నటించకూడదా? అని ప్రభాస్ డైలమాలో వున్నారట.