సలార్ హాలీవుడ్ వర్షన్ ఎలా ఉండబోతుందంటే?

Fri Mar 24 2023 09:32:33 GMT+0530 (India Standard Time)

Prabhas Salaar Movie in Hollywood

యంగర్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో  తెరకెక్కుతూ ఉన్న చిత్రం సలార్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. హై వోల్టేజ్ మాస్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ ని ఆవిష్కరిస్తున్నారు.కేజిఎఫ్ సిరీస్ తర్వాత అంతకుమించి అనే విధంగా సలార్ సినిమాని తెరపై చూపించడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతూ ఉండడం విశేషం. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 28న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ భాషలలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

 కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీతో  సినిమా బిజినెస్ పై ప్రశాంత్ నీల్ కి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది.  ఈ నేపథ్యంలో సలార్ సినిమాతో ఏకంగా 2  వేలకోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇండియన్ హిస్టరీలో ఇప్పటివరకు రాని కలెక్షన్స్ ని అందుకోవాలని భావిస్తున్నారు. దీనికోసం  ఇప్పుడు సలార్ సినిమాని ఏకంగా హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉండడం విశేషం.

అయితే ఈ హాలీవుడ్ వెర్షన్ కోసం ప్రత్యేకంగా డబ్బింగ్ ఆర్టిస్టులను ప్రొఫెషనల్ గా ఉన్న వారిని తీసుకొస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాలోని సాంగ్స్ ని ప్రత్యేకంగా రాసుకున్న కామెడీ ట్రాక్ ని తీసేసి కంప్లీట్ గా డార్క్ మోడ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే కథని ఆవిష్కరించే ప్రయత్నం  ప్రశాంత్ నీల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.  తెలుగు వెర్షన్ కి ఇంగ్లీష్ వెర్షన్ కి 30 నిమిషాలు వేరియేషన్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న టాక్.

హాలీవుడ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా హై వోల్టేజ్ యాక్షన్ మోడ్ లోనే మూవీని రిప్రజెంట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.  ఇండియన్ భాషల వరకు మాత్రం సాంగ్స్ ని ఉంచనున్నారు.

ఇక హాలీవుడ్ లో రిలీజ్ చేయడం ద్వారా మూవీకి ఎక్కువ మార్కెట్ దొరుకుతుందని అంచనా వేస్తున్నారు.  ఒకవేళ అదే జరిగితే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై  నుంచి హాలీవుడ్ కి వెళ్లిన మొట్టమొదటి హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచిపోతారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.