విదేశాల్లో డార్లింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్!

Sat Jan 29 2022 10:00:02 GMT+0530 (IST)

Prabhas Real Estate Business In Abroad

రెబల్  స్టార్ ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ కి రీచ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. `రాధేశ్యామ్`..`సలార్`..`ప్రాజెక్ట్ -కె`లాంటి చిత్రాలతో హిట్ కొట్టి పాన్ వరల్డ్ స్టార్ గా ఆవిష్కరించుకోవాలని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డార్లింగ్ సినిమా షూటింగ్ లు  కూడా ఎక్కువగా వీదేశీ షెడ్యూల్స్ ఉంటున్నాయి. మెజర్ పార్ట్ షూటింగ్ యూరప్ లాంటి దేశాల్లోనే చేస్తున్నారు.  రెండు..మూడు పాటల చిత్రీకరణ కూడా విదేశీ లొకేషన్స్ లో నే జరుగుతోంది. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్ అంటే ప్రభాస్ ఇబ్బందిపడేవారు. విదేశాలు వెళ్లడానికి అయిష్టత చూపించేవారు. కానీ ఇప్పుడా ఆలోచనల నుంచి బయట పడ్డారు.ఫారిన్ టూర్స్.. ఓవర్సీస్ షూటింగ్ లకు బాగా అలవాటు పడిపోయారు. ఏ రోజు ఏదేశంలో ఉంటున్నాడో తెలియనంత బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే విదేశీ విహార యాత్రని ముగించుకుని హైదరాబాద్ కి తిరిగొచ్చారు. ఇప్పుడు ఏకంగా విదేశాల్లోనే పెట్టుబడులు పెట్టెంతగా విదేశాల్ని ఇష్టపడుతున్నాడు అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్పెయిన్ లోని ప్రశాంతమైన ఓ బీచ్ కి స మీపంలో ఉన్నో పాత కాలపు విల్లాను విక్రయించాలని ప్లాన్ చేస్తున్నారుట.  అలాగే యూరప్ లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ లో పెట్టుబడలు పెట్టాలని ..ఖరీదైన ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు లీకైంది.

విదేశీ కల్చర్ కి బాగా అలవాటు పడటంతో పాటు..అక్కడి ప్రభుత్వాల విధి విధానాలు.. చిత్తశుద్దితో వ్యవహరించే తీరుకి ఆకర్షీతుడై వ్యాపారానికి అనుకూలమైన వాతావరణ ఏర్పడటం వంటి పరిస్థితుల్ని డార్లింగ్ మనసు విదేశీ పెట్టుబడుల వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఒక్కడే కాదు కొన్ని టాలీవుడ్ కుటుంబాలు విదేశాల్లో ఇప్పటికే వ్యాపార రంగంలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి..అల్లు అరవింద్ స్పెయిన్ లో హోటల్స్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు చాలా కాలంగా ప్రచారంలో ఉంది. తాజాగా ఆ వరుసలో డార్లింగ్ చేరారు.  ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే `రాధేశ్యామ్` రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే `సలార్` షూటింగ్ లోనూ బిజీగా ఉన్నారు.