ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్ డేట్!

Fri Aug 12 2022 18:04:44 GMT+0530 (IST)

Crazy Update On Prabhas Movie 'Project K'

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన `రాధేశ్యామ్` ఊహించని విధంగా ఫ్లాప్ కావడంతో ఫ్యాన్స్ ప్రభాస్ నుంచి త్వరగా కొత్త సినిమా రిలీజ్ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. ఇందులో ఇప్పటికే మైథలాజికల్ డ్రామా `ఆది పురుష్` షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ త్రీడీ పనుల్లో బిజీగా వుంది. ఈ మూవీతో ప్రభాస్ బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు.తెలుగుతో పాటు హిందీలో రూపొందిన ఈ మూవీని తమిళ మలయాళ కన్నడ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. ఇక ఈ మూవీతో పాటు `కేజీఎఫ్` సిరీస్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ తాజా షెడ్యూల్ ప్రభాస్ మోకాలికి శస్త్ర చికిత్స కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే కీలక ఘట్టాలని చిత్రీకరించగా ఈ మూవీ 40 శాతానికి పైగా పూర్తయినట్టుగా చెబుతున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు ప్రభాస్ `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` చేస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో విజువల్ వండర్ గా ఈ మూవీని దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీపికా పదుకోన్ దిషా పటానీ హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో నిరవధికంగా షూటింగ్ చేశారు.

పలు కీలక ఘట్టాలని చిత్రీకరించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన అశ్వనీదత్ ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో `ప్రాజెక్ట్ కె` 55 శాతం కంప్లీట్ అయిందని వెల్లడించారు.

ఇంతలోనే 55 శాతం షూటింగ్ పూర్తి కావడం నిజంగా షాక్ కు గురి చేస్తోంది. దీపికా పదుకోన్ అమితాబ్ బచ్చన్ వంటి వారితో షూటింగ్ చేస్తూ అప్పుడే 55 శాతం `ప్రాజెక్ట్ కె` షూటింగ్ ని పూర్తి చేయడం మామూలు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

టాలీవుడ్ షూటింగ్ ల బంద్ వున్నా కానీ మరో షెడ్యూల్ లో సినిమా మొత్తం పూర్తయ్యేదని అయితే షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేయాల్సి వచ్చిందని నిర్మాత సి. అశ్వనీదత్ స్పష్టం చేశారు. ప్రభాస్ మోకాలి ఆపరేషన్ తరువాత విశ్రాంతి తీసుకుంటున్న కాకరణంగానే `ప్రాజెక్ట్ కె` షూటింగ్ ని వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది.