Begin typing your search above and press return to search.

ప్రీరిలీజ్ బిజినెస్ లో జక్కన్నతో ప్రభాస్ పోటీ

By:  Tupaki Desk   |   28 May 2023 6:50 PM GMT
ప్రీరిలీజ్ బిజినెస్ లో జక్కన్నతో ప్రభాస్ పోటీ
X
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అని చెప్పాలి. ఏ సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది అనే దానిని బట్టి ఆ స్టార్ హీరోల రేంజ్ డిసైడ్ చేయబడి ఉంటుంది. స్టార్ హీరో ఫేమ్ ద్వారానే ఎక్కువగా బిజినెస్ డీల్స్ కుదురుతాయి. అయితే దానిని మొదటి సారి రాజమౌళి బ్రేక్ చేశాడు.

బాహుబలి 2 మూవీ హైయెస్ట్ బిజినెస్ డీల్స్ కుదరడానికి కారణం రాజమౌళి ఫేమ్ అని చెప్పాలి. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీగా మార్కెట్ రావడానికి కారణం రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ కారణం అని చెప్పొచ్చు. రామ్ చరణ్, తారక్ స్టార్ బ్రాండ్ కంటే ఆర్ఆర్ఆర్ కి ఎక్కువగా జక్కన్న ఇమేజ్ పనిచేసింది.

అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరోలలో చూసుకుంటే జక్కన్నతో సమానమైన ప్రీరిలీజ్ వ్యాపారాన్ని కలిగి ఉన్న హీరో డార్లింగ్ ప్రభాస్ అని చెప్పాలి. అయితే ప్రభాస్ కి ఆ రేంజ్ ప్రీరిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకునే ఇమేజ్ రావడానికి బాహుబలి సిరీస్ కారణం అని చెప్పాలి. ఈ సిరీస్ తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన సాహో మూవీ బిజినెస్ భారీగానే జరిగింది.

ఇక ఈ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా తెలుగులో వంద కోట్ల షేర్ ని రాబట్టింది. దీని తర్వాత వచ్చిన రాధేశ్యామ్ రైట్స్ ని కూడా భారీ ధరలకి కొనుగోలు చేశారు. అయితే మూవీ డిజాస్టర్ కావడంతో కొంత వరకు నష్టపోయిన భారీ లాస్ అయితే రాలేదని చెప్పొచు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆదిపురుష్ మూవీకి అయితే తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 170 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ రేంజ్ లో కేవలం తెలుగు స్టేట్స్ కి రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది అంటే సినిమా మీద, ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్ మీద నమ్మకంతోనే.

తెలుగులో మరి ఏ హీరోకి కూడా ఈ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ ఒక్క తెలుగు రాష్ట్రాలకి జరిగే ఛాన్స్ లేదని చెప్పొచ్చు. ఈ విషయంలో రాజమౌళి, ప్రభాస్ మధ్య ప్రీరిలీజ్ బిజినెస్ ఆధిపత్యం ఉంటుందనే మాట వినిపిస్తోంది.