Begin typing your search above and press return to search.

ప్రభాస్ లైనప్ లో అలాంటి మూవీ కూడా ఉండబోతోందా...?

By:  Tupaki Desk   |   18 Sep 2020 12:30 AM GMT
ప్రభాస్ లైనప్ లో అలాంటి మూవీ కూడా ఉండబోతోందా...?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్.. పాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే 'సాహో' సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ కి తానేంటో చూపించిన డార్లింగ్.. ప్రస్తుతం 'రాధే శ్యామ్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా రానున్న ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షనల్ జోనర్ లో ఉండబోతోందని సమాచారం. వీటితో పాటు ''ఆదిపురుష్'' అనే స్ట్రెయిట్ హిందీ మూవీని అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఓం రౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని టీ - సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ - క్రిషన్‌ కుమార్‌ నిర్మించనున్నారు. ఇప్పటికే లీడ్ క్యాస్ట్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న మేకర్స్ 'ఆదిపురుష్' ని 2022లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

కాగా, ప్రభాస్ ఇలా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. అందులోనూ ఈ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమైనవని చెప్పవచ్చు. 'రాధే శ్యామ్' పీరియాడికల్ లవ్ స్టోరీగా.. 'ఆదిపురుష్' రామాయణ ఇతిహాస నేపథ్యంలో.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షనల్ మూవీ అని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ తన నెక్స్ట్ మూవీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నాడట. 'డార్లింగ్' 'మిస్టర్ పర్ఫెక్ట్' వంటి యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో హిట్ కొట్టిన ప్రభాస్.. ఈ మధ్య అలాంటి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. 'బాహుబలి'తో వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అన్నీ ఆ స్థాయి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అదే తరహా సినిమాలు తీస్తూ పోతే ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారని భావిస్తున్న ప్రభాస్.. ఇప్పుడు మళ్ళీ క్లీన్ ఫ్యామిలీ మూవీ చేయాలని అనుకుంటున్నాడట. అందుకోసం ఫీల్ గుడ్ స్క్రిప్ట్ కోసం ప్రభాస్ చూస్తున్నాడని ఇండీస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఫ్యామిలీ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించే దర్శకుడు ప్రభాస్ కు దొరుకుతాడేమో చూడాలి.