ఫోటో స్టొరీ: సాహో లుక్కా.. జిల్ జిల్ లుక్కా?

Sun Jan 20 2019 20:15:58 GMT+0530 (IST)

Prabhas New Look in Talk

ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? 'బాహుబలి' రిలీజ్ కాకమునుపే టాలీవుడ్ లోని టాప్ లీగ్ స్టార్లలో ఒకరైన ప్రభాస్ స్టార్ ఇమేజ్ 'బాహుబలి' తర్వాత భారీగా పెరిగింది. ప్యాన్ ఇండియన్ స్టార్ గా దేశవ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు తయారయ్యారు.  అందుకోసమే యూనివర్సల్ అప్పీల్ ఉండే సినిమాలు ఎంచుకుంటూ ఉన్నాడు. ఇప్పటికే 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1' సంచలనం సృష్టించింది.షేడ్స్ ఆఫ్ సాహోలో ఒక షాట్ లో ప్రభాస్ లెదర్ జాకెట్ వేసుకొని కూలింగ్ గ్లాసెస్ తో అలా నడుచుకుంటూ వస్తుంటే ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  అప్పటి లుక్ వేరే. గడ్డం ఉంది. ఇప్పుడు లుక్ పూర్తిగా మారిపోయింది.  మీసాలు.. గడ్డం తీసేసి బాలీవుడ్ హీరో స్టైల్ లో ఉన్నాడు. హెయిర్ కూడా కొద్దిగా పెంచి సైడ్ కు దువ్వడంతో కొత్తగా కనిపిస్తున్నాడు.  ఈమధ్య రెండు మూడు సందర్భాల్లో ఈ లుక్ తో కనిపించడంతో ఫ్యాన్స్  ఫుల్ గా థ్రిల్ అయ్యారు. మీసాలు గడ్డంతో ఉన్నప్పటికంటే ఈ కొత్త లుక్ లో మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు డార్లింగ్.

పైన ఉండే ఫోటోలో పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుతో పాటుగా పోజు ఇచ్చాడు. ఈ ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.  బాలీవుడ్ హీరోలా ఉన్నాడని ఫ్యాన్స్ తెగ మురిసిపొతున్నారు. అయినా ఇది 'సాహో' లుక్కా లేదా రాధాకృష్ణ కుమార్ సినిమా కోసం మార్చిన జిల్ జిల్ లుక్కా?