ఓవర్సీస్ డీల్స్.. ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!

Fri Mar 31 2023 09:57:48 GMT+0530 (India Standard Time)

Prabhas Movies Overseas Deals

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన సినిమాకి 150 కోట్ల వరకు తీసుకుంటున్నట్లుగా ప్రచారం నడుస్తుంది. అలాగే ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రాలు కూడా ప్రభాస్ నుంచే రాబోతున్నాయి. ప్రస్తుతం హిందీలో ఓం రౌత్ దర్శకత్వంలో చేసిన ఆది పురుష్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత సెప్టెంబర్ 28 న హై ఎక్స్పెక్టేషన్ మూవీ సలార్ రిలీజ్ కాబోతోంది. కేజీఎఫ్ స్టార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతూ ఉన్న సంగతి అందరికి తెలిసింది. ఈ సినిమాని ఏకంగా 400 కోట్లతో నిర్మిస్తూ ఉన్నారు. కచ్చితంగా 1000 కోట్లు కలెక్షన్స్ ఏ మూవీ అందుకుంటుంది అని భావిస్తున్నారు.

ఇప్పటికే సలార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ప్రస్తుతం తన సత్తా చూపిస్తూ ఉండడం విశేషం. సలార్ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 70 కోట్లకు అమ్ముడు అయినట్లుగా సమాచారం. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఫ్యూచరిస్టిక్ మూవీ ప్రాజెక్ట్ కె కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంట.

ఈ సినిమాకి ఏకంగా 80 కోట్ల వరకు ఓవర్సీస్ రైట్స్ కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట. అయితే నిర్మాత అశ్విని దత్ మాత్రం ప్రస్తుతానికి బిజినెస్ పై ఎలాంటి ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్ తో ఇప్పటికే అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.

అయితే ఒక టీజర్ రిలీజ్ అయితే ప్రాజెక్ట్ కె పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయని భావిస్తున్నారు. అప్పుడు మూవీకి సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేస్తే మరింత రీచ్ ఉంటుందని ఆలోచనలో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాత అశ్విని దత్ ఉన్నట్లుగా ఇండస్ట్రీ టాక్.

ఈ సినిమాని ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్న నేపథ్యంలో కచ్చితంగా బిజినెస్ 1000 కోట్లకి క్లోజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమాతో 2000 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం హాలీవుడ్ లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉండటం విశేషం. మరి ప్రభాస్ కెరియర్ లో సలార్ ప్రాజెక్ట్ కె సినిమాలు ఏ స్థాయిలో పెర్ఫార్మన్స్ చేస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.