వింటేజ్ భవంతిలో అజ్ఞాత ప్రేమికుడా?

Fri Jan 17 2020 17:52:14 GMT+0530 (IST)

Prabhas Look on About His Upcoming Film

రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా జాన్ కి సంబంధించిన అధికారిక లుక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్ లో డార్లింగ్ ఎలా కనిపంచబోతున్నాడో చూడాలన్న క్యూరియాసిటీ అభిమానుల్లో  రోజు రోజుకి  రెట్టింపవుతోంది. సాహోలో లుక్ తో పోలిస్తే ఈసారి ప్రభాస్ పూర్తి మేకోవర్ చూపించబోతున్నారన్న టాక్ ఉంది. జాన్  లో లుక్ ఎలా ఉండబోతోంది? అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ లుక్ రిలీజ్ కి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. ఈ సినిమా అప్ డేట్ ఏదైనా రివీల్ చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చేస్తున్నా నిరాశే మిగిలింది.సంక్రాంతి కి అయినా డార్లింగ్ లుక్ రిలీజ్ చేస్తారని భావించినా అది కూడా నిరాశే అయ్యింది. తాజాగా డార్లింగ్ తన ఫ్యాన్స్ కి  ఊహించని షాక్ ఇచ్చాడు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా జాన్ ప్రీలుక్ తరహాలో ఓ పోస్టర్ ని అభిమానులకు షేర్ చేసాడు. జాన్ షూటింగ్ తిరిగి మొదలు పెడుతున్నట్లు వెల్లడించాడు. ఈ షెడ్యూల్ అంతా ఫన్ రైడ్ లా ఉంటుందని ప్రభాస్ తెలిపారు. న్యూ లుక్ విషయానికి వస్తే ప్రభాస్ కటౌట్ మామూలుగా ఉంటేనే అదుర్స్ అనిపిస్తుంది. పీరియాడిక్ లవ్ స్టోరీ లో క్లాసిక్ స్టైల్లో కనిపించి ఫ్యాన్స్ ని మురిపిస్తున్నాడు. ఆ లుక్ చూడగానే.. ప్రేయసి కోసం వెతుకుతున్న ప్రేమికుడి లా కనిపిస్తున్నాడు. ఒక కోణంలో చూస్తే అజ్ఞాత ప్రేమికుడా? అనిపిస్తోంది.

ఓ విలాసవంతమైన వింటేజ్ భవంతిలో ఏదో ఆలోచిస్తూ ఏటో చూస్తూ అజ్ఞాతవాసిలా ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఫ్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడి ఆ కళాకృతిని తీక్షణంగా చూస్తున్నాడు. ఎంతో పురాతన భవంతిలా అక్కడ ఆర్కిటెక్చర్ విలక్షణంగా కనిపిస్తొంది. ఫర్నిచర్..గోడలు..మెట్లు పాత కాలంలోకి తీసుకెళుతున్నాయి. 1960 నాటి లవ్ స్టోరీ కాబట్టి అప్పటి వాతావరణాన్ని తలపించేలా వేసిన ఓ సెట్ డిజైన్ ఇది. ఈ చిత్రంలో డార్లింగ్ సరసన పూజాహెగ్దే నటిస్తోంది. జిల్ ఫేం రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.