సాహోకి రివర్స్ లో ప్రభాస్ జాన్?

Wed Sep 11 2019 12:52:18 GMT+0530 (IST)

Prabhas Jaan Movie Casting

ఎన్నో అంచనాలతో అంతకు మించి బిజినెస్ తో వచ్చిన సాహో ఊహించిన దాని కన్నా దారుణంగా తక్కువ టైంలోనే ఫైనల్ రన్ కు రావడం అభిమానులకే కాదు సగటు సినిమా ప్రేమికులకు సైతం బాధ కలిగించే విషయం. తెలుగు సినిమా స్థాయిని బాహుబలి తర్వాత మరోసారి ఇంకా ఎత్తుకు తీసుకు వెళ్తుందన్న నమ్మకం వారం రోజుల్లోనే సడలిపోయింది. ఇక సాహోది గడిచిపోయిన చరిత్ర.ఇదిలా ఉండగా సాహో తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఇదే యువి బ్యానర్ లో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి జాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. బడ్జెట్ సైతం 180 కోట్ల దాకా కేటాయించినట్టు టాక్. మరో షాకింగ్ అప్ డేట్ ఏంటంటే ఇందులో కేవలం ఐదారుగురు మాత్రమే కీలక ఆర్టిస్టులు ఉంటారట. కథ  - మొత్తం వీళ్ళ చుట్టే తిరుగుతూ 1960లోని యూరోప్ బ్యాక్ డ్రాప్ ఎవరూ ఊహించని  భిన్నమైన స్క్రీన్ ప్లేతో ఇది సాగుతుందని వినికిడి.

ఇందుకుగాను 25 సెట్లను వేయబోతున్నట్టుగా తెలిసింది. అన్ని హైదరాబాద్ లోనే ఉంటాయట. సాహోలో ఆర్టిస్టులు ఎక్కువైపోయి అయోమయం నెలకొంటే ఇప్పుడీ జాన్ వాళ్ళకు పూర్తిగా కోత పెట్టేసి హీరో హీరొయిన్ల మీదే ఫోకస్ పెడతారన్న మాట. ఇటీవలే పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో తాను విన్న గొప్ప కథల్లో జాన్ దే మొదటి స్థానం అని చెప్పడం ఇప్పటికే టాక్ గా మారింది. ఈ నేపధ్యంలో ఇలాంటి ఎగ్జైటింగ్ అప్ డేట్ కన్నా అభిమానులకు కావల్సింది ఏముంటుంది