యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. ఆ ఇమేజ్ ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే 'సాహో' సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన డార్లింగ్.. ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వలో 'రాధే శ్యామ్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే స్ట్రెయిట్ హిందీ మూవీని ప్రకటించాడు. ఇవి ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో ఎప్పుడు పూర్తి చేస్తాడో అని ఫ్యాన్స్ అందరూ ఆలోచిస్తుంటే సడన్ గా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు.
'కేజీఎఫ్
2' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'సలార్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో
నటించబోతున్నానని ప్రకటించాడు ప్రభాస్. 'కేజీఎఫ్' నిర్మాతలు నిర్మించనున్న ఈ
చిత్రాన్ని 2021 జనవరిలో స్టార్ట్ చేస్తామని వెల్లడించారు. ఈ సినిమాలన్నీ
వేటికవే ప్రత్యేకమైనవని చెప్పవచ్చు. 'రాధే శ్యామ్' పీరియాడికల్ లవ్
స్టోరీగా.. 'ఆదిపురుష్' ఇతిహాస నేపథ్యంలో.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ సైన్స్
ఫిక్షనల్ మూవీగా.. 'సలార్' యాక్షన్ మూవీగా రూపొందనున్నాయి. అయితే నాగ్
అశ్విన్ మూవీకి ఎక్కువ డేట్స్ అవసరం ఉండటంతో ముందుగా 'సలార్' 'ఆదిపురుష్'
చిత్రాలను పూర్తి చేయాలని ప్రభాస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
'ఆదిపురుష్'
'సలార్' రెండు సినిమాలకు స్క్రిప్ట్ రెడీగా ఉండటం.. ఎక్కువ భాగం సెట్స్ లో
గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేసే సినిమాలు కావడంతో తక్కువ రోజుల్లో పూర్తి
చేయొచ్చు. అందుకే వీటి షూట్ కంప్లీట్ అయిన తర్వాత నాగ్ అశ్విన్ సినిమాని
ప్రారంభిస్తాడట. రాబోయే రెండేళ్లలో ఈ మూవీస్ అన్నీ పూర్తి చేయాలని ప్రభాస్
ప్లాన్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలన్నీ తెలుగు
తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ డబ్బింగ్
చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఏదేమైనా పాన్ ఇండియా సూపర్ స్టార్ ఇమేజ్ ని
నిలబెట్టుకోడానికి ప్రభాస్ మంచి ప్లాన్ తోనే వెళ్తున్నాడని సినీ వర్గాలు
అంటున్నాయి.