Begin typing your search above and press return to search.

ఆ సినిమా సక్సెస్.. ప్రభాస్, హృతిక్ లైన్ ఫ్రీ

By:  Tupaki Desk   |   30 Jan 2023 12:00 PM GMT
ఆ సినిమా సక్సెస్.. ప్రభాస్, హృతిక్ లైన్ ఫ్రీ
X
ఇటీవల కాలంలో బిగ్ యాక్షన్ సినిమాలకు మాత్రమే కాకుండా మల్టీస్టారర్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ అందుతొంది. స్టార్ హీరోలు ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. సినిమా మార్కెట్ వాల్యూ తో పాటు మల్టీ స్టారర్ సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక దర్శకులు కూడా స్వేచ్ఛగా భారీ నిర్మాణ సంస్థలతో చేతులు కలిపి సినిమాలను నిర్మిస్తున్నారు.

ఇక రాబోయే రోజుల్లో మరిన్ని అతిపెద్ద మల్టీ స్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సౌత్ నార్త్ హీరోలు కూడా చేతులు కలపబోతున్నారు. ప్రభాస్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అని చాలా కాలంగా కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు తెరపై వస్తుంది అనే విషయంలో ఇంతవరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే వీరి కాంబినేషన్ ను ఏకం చేసేందుకు యష్ రాజ్ ఫిలిమ్స్ తో పాటు మరికొన్ని బడా సంస్థలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అందరికంటే ముందుగానే మైత్రి మూవీ మేకర్స్ హృతిక్ రోషన్ ను ప్రభాస్ ను కలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమాను తెరపైకి తీసుకురావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటుంది.

అయితే అందులో హృతిక్ రోషన్ పాత్ర కూడా ఉండే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ దర్శకుడు ఆ రేంజ్ లో ఇద్దరు బడా హీరోలను పెట్టి పెద్ద సినిమాను బ్యాలెన్స్ చేయగలడా అని కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పఠాన్ సినిమాతో సిద్ధార్థ ఆనంద్ ఆ అనుమానాలకు తెరదించాడు. దీంతో మార్కెట్ లైన్ కూడా ఫ్రీ అయింది అని చెప్పవచ్చు. తప్పకుండా వీరి కాంబినేషన్లో సినిమా వస్తే పెట్టిన పెట్టుబడి మొత్తం విడుదలకు ముందే నిర్మాతలు చేతుల్లో వచ్చేస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుపై పూర్తి క్లారిటీ రావాలి అంటే మరొక ఏడాది ఆగాల్సిందే. ఎందుకంటే సిద్ధార్థ్ హృతిక్ రోషన్ తో ఫైటర్ అనే సినిమా కూడా చేయబోతున్నాడు. ఇక 2024 లో ప్రభాస్ హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ప్రాజెక్టుపై ఈ దర్శకుడు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.