Begin typing your search above and press return to search.

కార్తికేయ 2 కోసం ప్రభాస్.. మరి మిగిలిన వాళ్ళు?

By:  Tupaki Desk   |   17 Aug 2022 8:30 AM GMT
కార్తికేయ 2 కోసం ప్రభాస్.. మరి మిగిలిన వాళ్ళు?
X
సినిమా ఇండస్ట్రీలో అందరూ చాలా అన్యోన్యంగా ఉంటారు అని.. ఒక సినిమా సక్సెస్ అయితే మరొకరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని.. పైకి చాలా చెబుతూ ఉంటారు. కానీ అందుకు తగ్గట్టుగా పరిస్థితులు ఉండవు అని అప్పట్లో రాంగోపాల్ వర్మ అలాగే నాగబాబు కూడా వారి తరహాలో కౌంటర్ ఇచ్చారు. ఏదో తెలియని కుళ్ళు బుద్ధి అయితే ఉంటుంది అని చెప్పకనే చెప్పేసారు. అయితే అలాంటి తరహా ఆలోచనలు మాత్రం కొంతమంది హీరోలు దరిదాపుల్లోకి కూడా రానివ్వరు.

ముఖ్యంగా ప్రభాస్ అయితే ఎవరు సక్సెస్ అందుకున్నా కూడా చాలా హ్యాపీగా విష్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మరికొందరు ఇతర కారణాల వలన బిజీగా ఉండడం కొలన రియాక్ట్ అవ్వకపోవచ్చు. అయితే ఇప్పుడున్న బిజీలో ఫ్యాన్ ఇండియా స్టార్స్ లో ప్రభాస్ తప్పితే కార్తికేయ 2 సినిమాపై పెద్దగా ఎవరు రియాక్ట్ అయ్యింది లేదు. ప్రభాస్ ప్రత్యేకంగా కార్తికేయ 2 యూనిట్ సభ్యులందరికీ కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పెషల్ విషెస్ ని అందించాడు.

ఒక పాన్ ఇండియా స్టార్ విష్ చేశాడు అంటే నేషనల్ వైడ్ లో సినిమాకు మరింత రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న సినిమాకు ఈ పోస్ట్ చాలా మంచిది అని చెప్పవచ్చు. మిగతా హీరోలు కూడా ఇదే తరహాలో స్పందిస్తే బాగుంటుంది అనే కామెంట్స్ అయితే చాలానే వినిపిస్తున్నాయి.

అసలైతే విడుదలకు ముందు ఈ సినిమాను పెద్దగా ఎవరు పట్టించుకున్నది లేదు. అసలు చిత్ర యూనిట్ సభ్యులు అయితే ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో కూడా తెలియని కన్ఫ్యూజన్లోనే కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది.

మూడుసార్లు వరుసగా వాయిదా పడడంతో అసలు సినిమా పరిస్థితి ఏమవుతుంది అనే కంగారులో కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కార్తికేయ 2 సినిమా కొన్ని వివాదాలతోనే మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుని సక్సెస్ ట్రాక్లోకి ఎక్కేసింది.

ఇక ప్రభాస్ లాంటి హీరోలు ఇలాంటి సమయంలో ఈ సినిమాకు ఇంకాస్త సపోర్ట్ చేస్తే తెలుగు చిత్ర పరిశ్రమకు అలాగే భవిష్యత్తులో రాబోయే మరిన్ని సినిమాలకు కూడా కొంత బూస్ట్ ఇచ్చిన వారు అవుతారు. మరి ప్రభాస్ చేశాడు కదా అని మిగతా హీరోలు కూడా ఇదే తరహాలో ఇంకాస్త సపోర్ట్ చేస్తారో లేదో చూడాలి.