Begin typing your search above and press return to search.

ఇంత‌కీ ప్ర‌భాస్ రీమేక్ ఉన్న‌ట్టా లేన‌ట్టా?

By:  Tupaki Desk   |   27 Jun 2022 6:41 AM GMT
ఇంత‌కీ ప్ర‌భాస్ రీమేక్ ఉన్న‌ట్టా లేన‌ట్టా?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ దాదాపు ప‌ద‌హీరేళ్ల క్రితం అంటే 2005లో న‌టించిన హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'ఛ‌త్ర‌ప‌తి'. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ బూవీ అప్ప‌ట్లో రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధించిన ప్ర‌భాస్ ని మాస్ హీరోగా నిల‌బెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీ ప్ర‌భాస్ ని స్టార్ హీరోల జాబితాలో చేర్చింద‌ని చెప్పొచ్చు. ఈ మూవీని ఇన్నేళ్ల త‌రువాత హిందీలో రీమేక్ చేయాల‌ని, ఈ మూవీ ద్వారా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కావాల‌ని నిర్ణ‌యించుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌.

మాస్ మ‌సాలా యాక్ష‌న్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ఈ రీమేక్ కు ద‌ర్శ‌కుడు. 'RRR' మూవీని ఉత్త‌రాదిలో విడుద‌ల చేసిన డా. జ‌యంతి లాల గ‌డ ఈ మూవీకి నిర్మాత‌. గ‌త కొన్ని నెల‌ల క్రితం ఈ మూవీ కోసం భారీ సెట్ లు వేశామ‌ని, త్వ‌ర‌లోనే అందులో షూటింగ్ చేయ‌బోతున్నామంటే మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ మూవీ కోసం భారీ స్థాయిలో మేకోవ‌ర్ ప‌రంగా హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది.

ఆ త‌రువాత కురిసిన భారీ వాన‌ల‌కు 'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్ కోసం వేసిన సెట్ ల‌న్నీ పాడైపోయాయి. దీంతో మ‌ళ్లీ కొత్త‌గా సెట్ ల‌ని నిర్మిస్తామ‌ని, త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు పెడ‌తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఆ త‌రువాత నుంచి ఇంత వ‌ర‌కు ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ లేదు. ఇంత‌కీ ఈ రీమేక్ మొద‌లైందా? .. స్టార్టింగ్ లోనే ఆగిందా? అన్న‌ది క్లారిటీ లేదు. హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఈ మూవీపై వున్న గ‌ట్టి న‌మ్మ‌కంతో ఇంత వ‌ర‌కు మ‌రో ప్రాజెక్ట్ ని అంగీక‌రించ‌లేదు.

దీంతో 'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్ ఉన్న‌ట్టా ? లేన‌ట్టా అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. షూటింగ్ మొద‌లు పెట్టారా? .. ఇంకా మొద‌లు పెట్ట‌లేదా? ల‌ని నెట్టింట కామెంట్ లు చేస్తున్నారు. ప్ర‌భాస్ హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీని రీక్రియేట్ చేయ‌డం హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ చేస్తున్న సాహ‌స‌మే అని చెప్పాలి. మ‌రి ఇంత సాహ‌సానికి పూనుకున్న ఈ మూవీ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?.. ఎప్పుడు బాలీవుడ్ లో రిలీజ్ కాబోతోంద‌న్న‌ది మాత్రం మేక‌ర్స్ నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు.

ఇదిలా వుంటే ఈ మూవీకి టైటిల్ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారిన‌ట్టుగా తెలుస్తోంది. 'ఛ‌త్ర‌ప‌తి' టైటిల్ తో పాటు శివాజీ టైటిల్స్ ని బాలీవుడ్ కు సంబంధించిన మేక‌ర్స్ ఇప్ప‌టికే రిజిస్ట‌ర్ చేయించుకున్నార‌ట‌. దీంతో బెల్లంకొండ శ్రీ‌నివాస్ మూవీకి టైటిల్ దొర‌క‌ని ప‌రిస్థితి. క‌రెక్ట్ యాప్ట్ టైటిల్ కోసం మేక‌ర్స్ ప్ర‌స్తుతం వెతుకుతున్నార‌ట‌. ఇది తెలిసిన వాళ్లంతా ఈ రీమేక్ ఎప్ప‌టికి పూర్త‌య్యేను ఎప్ప‌టికి హిందీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చేను అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.