అంబానీల పెళ్లిలో డార్లింగో

Sun Dec 09 2018 14:00:01 GMT+0530 (IST)

Prabhas And Other Celbrities Attend for Ambani Wedding

రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా?  రాజుగారి ఇంట్లో పెళ్లి అంటే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా?  నిన్నటిరోజున ఉదయ్ పూర్ లో బిజినెస్ టైకూన్ రిలయన్స్ అంబానీల ప్రీవెడ్డింగ్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ- `రియల్` టైకూన్ ఆనంద్ పిరమాళ్ ప్రీవెడ్డింగ్ వేడుకకు అటు బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమ నుంచి ప్రముఖులు ఎటెండ్ అయ్యారు. కేవలం సినీరంగానికి చెందిన అతిధులే కాదు.. అటు పారిశ్రామిక వేత్తలు - బిజినెస్ టైకూన్ లు అటెండ్ అయ్యారు.అయితే ఈ వేడుకలో ఊహించని అతిపెద్ద సర్ ప్రైజ్ ఎవరు? అంటే మన డార్లింగ్ ప్రభాస్. సినీ - రాజకీయ - క్రీడా - పారిశ్రామిక వేత్తలతో అతిపెద్ద జాబితాను రూపొందించిన అంబానీలు అందులో ప్రభాస్ పేరును చేర్చడం సౌత్‌లో ఇప్పుడు ప్రధానంగా చర్చకొచ్చింది. ఒకే ఒక్క బాహుబలి సిరీస్ మన డార్లింగ్ కి ఏ స్థాయి గుర్తింపును తెచ్చిందో చెప్పేందుకు ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ అవసరం లేదు. అంబానీల ఇంట మోదీకి అయినా పిలుపు ఉంటుందో లేదో కానీ - మన ప్రభాస్ కి మాత్రం పిలుపు గ్యారెంటీ అని ఈ ఇన్విటేషన్ చెబుతోంది. కరణ్ జోహార్ తో స్నేహం దరిమిలా డార్లింగ్ కూడా పార్టీ కిడ్ అయిపోతున్నాడని ఈ ఉదంతం చెబుతోంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ - రెడ్ చిల్లీస్ అధినేత - కింగ్ ఖాన్ షారూక్ కి ఎంత గౌరవం దక్కిందో మన డార్లింగ్ ప్రభాస్ కి అంతే గౌరవం దక్కింది ఈ  ప్రీపెళ్లిలో. అంత పెద్ద ఈవెంట్ కి డార్లింగ్ ఎంతో సింపుల్ గా వెళ్లాడు. ఏమాత్రం ఆర్భాటం లేకుండా కనిపించాడు. అసలు ఇలాంటి వేడుకల్లో ఏనాడూ పెద్దంతగా కనిపించని మన డార్లింగ్ సిగ్గును వదిలేసిన వాడిగా.. మారిన మనిషిలా కనిపిస్తున్నాడు. కేవలం రెండే రెండ్రోజుల్లో ముంబైని సునామిలా చుట్టేశాడు. కాఫీ విత్ కరణ్ షో.. కేజీఎఫ్ ప్రమోషన్స్..లో పాల్గొన్నాడు. అటుపై ముంబై నుంచి నేరుగా ఉదయ్ పూర్ లో అంబానీల ప్రీపెళ్లికి ఎటెండ్ అయ్యాడు. ఉదయ్‌పూర్ ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ దిగినప్పటి ఫోటోలు ప్రస్తుతం వెబ్ లో దర్శనమిస్తున్నాయి. వామ్మో డార్లింగో అనే రేంజులో ప్రభాస్ చుట్టరికాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హిందీ సర్కిల్స్ లో స్పెషల్ మ్యాన్ గా పాపులరవుతున్నాడు. ఇక భారీ యాక్షన్ చిత్రం `సాహో` రిలీజ్ తర్వాత అతడి పాపులారిటీ స్కైని టచ్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. `సాహో` హిందీ వెర్షన్ ని తెలుగును మించి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.