గ్రూప్ ఫొటో ఫ్రేమ్ అదిరింది

Mon Jun 27 2022 17:36:24 GMT+0530 (IST)

Prabhas Amitabh Bachchan Nani Dulquer Salmaan attend Project K producers new office launch

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. మూడు భారీ సినిమాలకు శ్రీకారం చుట్టిన ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్న మైథలాజికల్ మూవీ `ఆది పురుష్` షూటింగ్ ని పూర్తి చేశారు. రామాయణ గాథ ఆధారంగా జపాన్ మూవీ స్ఫూర్తితో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ రాకెట్ స్పీడుతో పూర్తి చేసుకున్న ఈ మూవీ  ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోంది.ఈ మూవీ తరువాత ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్`లో నటిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ రఫ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. క్రేజీ ప్రాజెక్ట్ గా ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ నేపథ్యంలో `ప్రాజెక్ట్ కె` చేస్తున్నారు. `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ లేడీ దీపికా పదుకోన్ నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా షెడ్యూల్ పూర్తి కావడంతో హీరో ప్రభాస్ టీమ్ అందరికి ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటు చేశారట. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ వైరల్ గా మారింది. ఈ పార్టీలో అమితాబ్ బచ్చన్ దుల్కర్ సల్మాన్ నాని ప్రభాస్ తో పాటు టీమ్ అంతా పాల్గొన్నారట.

అయితే తాజాగా బయటికి వచ్చిన ఓ ఫొటో ఫ్రేమ్ అదరింది. ప్రభాస్ పార్టీలో అమితాబ్ బచ్చన్ దుల్కర్ సల్మాన్ నానిలతో పాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కూడా పాల్గొన్నారట. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. మళ్లీ ఇలాంటి ఫ్రేమ్ కుదరదని ఇలాంటి సందర్భం మళ్లీ రాదని భావించారో ఏమో గానీ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్ రాఘవేంద్రరావు హీలు నాని దుల్కర్ సల్మాన్ దర్శకుడు నాగ్ అశ్విన్ ..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

వీరంతా కలిసి దిగిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. గ్రూప్ ఫొటో ఫ్రేమ్ అదిరింది అంటూ నెటిజన్స్ ఈ ఫొటోపై కామెంట్ లు చేస్తున్నారు. `ప్రాజెక్ట్ కె` నూతన ఆఫీసు గృహ ప్రవేశం సందర్భంగా వీరంతా ప్రత్యేకంగా పాల్గొన్నారని ఆ సందర్భంలోనే ఈ ఫొటోలు బయటికి వచ్చాయని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో `ప్రాజెక్ట్ కె`ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ మూవీలో దీపికా పదుకునే తో పాటు దిషా పటాని మరో నాయికగా నటిస్తోంది.