పవన్ వస్తారా? రారా?

Sat Mar 18 2023 13:00:09 GMT+0530 (India Standard Time)

Powerstar pawan kalyan movie news

పవన్ కళ్యాణ్తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు అందరూ బేజారు అవుతున్నారు. దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే... మరోపక్క రాజకీయాల మీద దృష్టి పెట్టడమే. వాస్తవానికి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో పవన్ పూర్తిగా తాను సినిమాలకు దూరమవుతున్నానని ప్రకటించారు. కానీ 2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు రావడంతో మళ్లీ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు.



అయితే ఒకపక్క రాజకీయం చేస్తూ... మరోపక్క సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన డేట్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయని విషయం మీద నిర్మాతలు మేనేజర్లు ఏమీ తేల్చుకోలేకపోతున్నారు. ముందుగా ఒక డేట్ ఇవ్వడం దాని ప్రకారం నిర్మాత మేనేజర్ లొకేషన్ అన్నీ సెట్ చేసుకుని రెడీగా ఉన్న సమయంలో రాజకీయంగా ఏదో ఈవెంట్ కోసం పవన్ వెళ్లారని వార్తలు రావడంతో వారందరూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ కావాలని చేయకపోయినా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలకు టెన్షన్ గా మారిందని అంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తున్న వినోదాయ సీతం రీమేక్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల నేపథ్యంలో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు. శనివారం నుంచి అంటే ఈరోజు నుంచి షూట్ మూడు రోజుల పాటు ఒక లొకేషన్ లో సెట్ చేశారు.

కానీ అందరూ షూటింగ్ సెట్ కి వచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రాలేరని వరుసగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈరోజు రాలేరని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ లొకేషన్ కోసం మూడు రోజులు పాటు పర్మిషన్ తీసుకున్నారు. ఒకరోజు పవన్ కళ్యాణ్ రాలేను అని చెప్పడంతో రేపు ఎల్లుండి అయినా వస్తారా రారా అనే విషయం మీద సినిమా యూనిట్ అంతా గందరగోళంలో ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వస్తారా రారా అనే విషయం మీద ఆధారపడి ఈ సినిమా షూటింగ్ ఉందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.