Begin typing your search above and press return to search.
పవన్ తల్చుకుంటే సమ్మర్ లో దిగడం ఖాయం
By: Tupaki Desk | 31 Jan 2023 9:00 AMపవన్ కళ్యాణ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం అన్నట్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా ఈ ఏడాదిలో విడుదల అవ్వడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇదే ఏడాది మరో సినిమా కూడా పవన్ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నేడు పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం 30 వర్కింగ్ డేస్ లోనే ఆ సినిమాను పూర్తి చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయట.
పవన్ కళ్యాణ్ గట్టిగా అనుకోవాలి కానీ సుజీత్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా షూటింగ్ వెంటనే ప్రారంభించి కంటిన్యూగా నెల రోజుల పాటు చిత్రీకరణ చేసి ఇదే సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.
ఒక వైపు జనసేన పార్టీ పనులతో పాటు మరో వైపు షూటింగ్స్ అంటే పవన్ సినిమాలకు ఇబ్బంది అవుతుంది. ఆ కారణంగానే హరి హర వీరమల్లు ఎప్పుడో పూర్తి అవ్వాల్సినా ఇంకా పూర్తి అవ్వలేదు. కనీసం సుజీత్ సినిమాకు అయినా పవన్ తల్చుకుని డేట్లు ఇస్తే సమ్మర్ లో విడుదల చేయాలని దానయ్య భావిస్తున్నాడట. సమ్మర్ కాకున్నా కనీసం దసరా వరకు అయినా పవన్.. సుజీత్ సినిమా వస్తే గొప్ప విషయమే.
పవన్ డేట్లు ఇస్తే షూటింగ్ ను మొదలు పెట్టి తన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ను 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అంటూ ఇటీవల ఒకానొక సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించాడు. కనుక ఏడాది గ్యాప్ లో పవన్ నుండి మూడు సినిమాలు రాబోతున్నాయి. ఇది ఆయన అభిమానులకు పెద్ద పండగలాంటి వార్త. అయితే ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.