#పవర్ స్టార్ .. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ కన్వినెంటేనా?

Mon Feb 22 2021 23:00:02 GMT+0530 (IST)

Powerstar High Voltage Action Scenes Convenient?

ఫ్లోలో ఉన్నప్పుడు యాక్షన్ సీన్లు చేయడం వేరు.. కాస్త గ్యాప్ ఇచ్చాక స్టంట్స్ చేయడం వేరు. పైగా ఏజ్ 50కి చేరువైతే అదేమీ అంత సులువేమీ కాదు. కానీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్ లో నటించాల్సి ఉందట. ఓవైపు రాజకీయాల్లోకి వెళ్లాక గ్యాప్ వచ్చింది. అయినా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేసి పవన్ దుమ్ము రేపుతున్నారు. అయితే ఇంత తీవ్ర ఒత్తిడిని ఆయన ఎలా ఎదుర్కొంటున్నారు? అన్నదే ఆశ్చర్యపరుస్తోంది.ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలోని హిస్టారికల్ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 7వ శతాబ్దపు రాజవంశాలను పోలి ఉండే సెట్ లు వేసి అందులో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ సాగుతోంది. పవన్ ఎనర్జిటిక్ గా పెర్ఫామ్ చేస్తున్నారట. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ స్నేహితుడు ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.

ఓవైపు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ మూవీ రెండో షెడ్యూల్ మార్చి 1 నుండి ప్రారంభం కానుంది. సాగర్. కె. చంద్ర దర్శకత్వంలో సితార సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ లో బిజూ మీనన్- పృథ్వీరాజ్ పోషించిన పాత్రలను ఇక్కడ పవన్- రానా చేస్తున్నారు. తొలి షెడ్యూల్ ఇప్పటికే చిత్రీకరించిన సంగతి తెలిసిందే.