Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ నిజంగానే ఆ డైరెక్టర్ ని కొట్టాడా...?

By:  Tupaki Desk   |   11 July 2020 5:00 PM GMT
పవర్ స్టార్ నిజంగానే ఆ డైరెక్టర్ ని కొట్టాడా...?
X
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాస్తవ సంఘటనలు.. నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసి సంచలనాలు క్రియేట్ చేసిన వర్మ గత కొన్నేళ్లుగా వివాదాస్పద చిత్రాలను రూపొందిస్తూ సంచలనం రేపుతున్నాడు. ఈ క్రమంలో 'పవర్ స్టార్' అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 'పవర్ స్టార్' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పిలుస్తూ ఉంటారని యావత్ సినీ అభిమానులకు తెలుసు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ సినిమా నిజ జీవితంలోని ఏ వ్యక్తిని ఉద్దేశించి తీస్తుంది కాదని.. పొలిటికల్ పార్టీ స్థాపించి ఎన్నికలలో ఓడిపోయిన ఓ స్టార్ హీరో స్టోరీ అని.. ఏ వ్యక్తికైనా దగ్గర పోలికలు ఉంటే అది యాదృచ్చికంగా జరిగింది మాత్రమేనని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ మూవీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ను టార్గెట్ చేస్తూ తీస్తున్నదే అని అందరికీ తెలిసినా ఆర్జీవీ మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. ఇక ఇప్పటికే 'పవర్ స్టార్' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ త్వరలోనే ఈ సినిమాని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.

'పవర్ స్టార్' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుండి వర్మ ఈ సినిమాకి సంబందించిన ఏదొక ఫోటో రిలీజ్ చేస్తూ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా వర్కింగ్ స్టిల్స్ ఒక్కొక్కటిగా వదులుతూ సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఈ ఫోటోలలో పవన్ కల్యాణ్‌ ని పోలి ఉన్న నటుడితో పాటు మెగాస్టార్ చిరంజీవి గెటప్‌ లో ఉన్న మరో వ్యక్తి ఉన్న ఫోటోలను కూడా రిలీజ్ చేశాడు. ఇక వాళ్లతో పాటు పవర్ రొమాంటిక్ పోస్టర్ అంటూ ఓ మహిళ ఫొటోనూ వదిలాడు. అలాగే, ప్రధాన పాత్రధారి ఓ దర్శకుడితో ఉన్న స్టిల్‌ కూడా వదిలాడు. తాజాగా పవర్ స్టార్ పాత్రధారి టాలీవుడ్ డైరెక్టర్‌ ను పోలిన వ్యక్తిని కొట్టినట్లు మరో పోస్టర్ రిలీజ్ చేసాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'పవర్ స్టార్' అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమాలో TS అనే యాక్టర్ కూడా ఉన్నాడని వర్మ చెప్పగా..TS అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అంటున్నారు. అయితే ఇప్పుడు వర్మ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ పై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా డిస్కషన్ స్టార్ట్ చేసారు. వర్మ తన సినిమాల్లో రియల్ ఇన్సిడెంట్స్ ని పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సదరు డైరెక్టర్ ని నిజంగానే కొట్టాడా అని నెటిజెన్స్ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం అది వర్మ పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తుంటే మరికొందరు మాత్రం రామ్ గోపాల్ వర్మ నిజ జీవితంలో జరిగిన సంఘటనలు మాత్రమే సినిమాల్లో తీస్తాడు అంటూ వాదిస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందే ఇన్ని వివాదాలు క్రియేట్ చేస్తున్న 'పవర్ స్టార్' సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని కాంట్రావర్సీలు లేవనెత్తుతుందో అని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు.