Begin typing your search above and press return to search.

మొత్తానికి ఓ హిట్టోచ్చింది

By:  Tupaki Desk   |   5 Jun 2023 10:00 AM GMT
మొత్తానికి ఓ హిట్టోచ్చింది
X
బాలీవుడ్ సినిమాలలో ఈ మధ్యకాలంలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తోన్న హాలీవుడ్ ఇనిస్పిరేషన్ తో సినిమాలు చేయడానికి ట్రై చేస్తూ బోర్లా పడుతున్నారు. అలాగే హీరోయిన్స్ తో కేవలం బికినీలు, స్విమ్ సూట్ లు వేయిస్తూ బిగ్ స్క్రీన్ పై అస్సలు అవసరం లేని పత్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులని విసిగిస్తున్నారు.

దీంతో ఈ మధ్య హిందీ ఇండస్ట్రీకి ఎక్కువ ఫ్లాప్ లు వస్తున్నాయి. అదే సమయంలో దేశీ కంటెంట్ తో వస్తోన్న సౌత్ సినిమాలకి నార్త్ ఇండియాలో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే బాలీవుడ్ మేకర్స్ కూడా అర్ధం చేసుకుంటున్నారు. అందుకే మళ్ళీ విదేశీ మోజు నుంచి దేశీ స్టైల్ కథలపైన శ్రద్ధ పెడుతున్నారు.

అలా ఇండియన్ కల్చర్, ఆద్యాత్మిక కోణం నుంచి వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా బాలీవుడ్ కి చాలా కాలం తర్వాత ఊపిరి పోసింది. పఠాన్ లో కూడా ఇండియన్ రా ఏజెంట్ గా షారుఖ్ ఖాన్ నటించడం యాక్సప్ట్ చేశారు.

ఇండియన్ స్పై థ్రిల్లర్ కథలకి ఫుల్ డిమాండ్ ఉంటుందని పఠాన్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు స్వచ్చమైన దేశీ ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన చిన్న సినిమా బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టిస్తోంది.

జరా హట్కే జర బచ్ కే అనే మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విక్కీ కౌశల్, సారా ఆలీఖాన్ ఈ మూవీలో జోడీగా నటించారు. ఈ సినిమా కంటెంట్ పరంగా చూసుకుంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు వేరు కాపురం పెట్టాలని ట్రై చేస్తారు. దానికోసం ఒక గవర్నమెంట్ స్కీమ్ యూజ్ చేసుకోవడానికి విడాకులు తీసుకుంటున్నట్లు నాటకం ఆడుతారు.

దీంతో వారి లైఫ్ లో ఎలాంటి సిచువేషన్స్ ఎదురయ్యాయి. ఫ్యామిలీ పరంగా ఎదురైనా సవాళ్ళు వంటి వాటిని కంప్లీట్ గా ఫన్ బేస్డ్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాతో తెరకెక్కిన సినిమా కావడంతో దీనికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రెండు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 12.7 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.ఈ మూవీకి ఒక టికెట్ కొంటె ఇకోటి ఫ్రీ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. దీంతో థియేటర్స్ కి విపరీతంగా ఆడియన్స్ తరలి వస్తున్నారు.