Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ నోట్.. మోసగాళ్ళకి మోసగాడు పాజిటివ్ బజ్

By:  Tupaki Desk   |   28 May 2023 4:24 PM GMT
ఎన్టీఆర్ నోట్.. మోసగాళ్ళకి మోసగాడు పాజిటివ్ బజ్
X
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఆయన సూపర్ హిట్ మూవీ మోసగాళ్ళకి మోసగాడు రీరిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణని మరోసారి ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని ఈ హిట్ మూవీని ఫ్యాన్స్ కోరిక మేరకు రీరిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే మోసగాళ్ళకి మోసగాడు సినిమా రీరిలీజ్ అయ్యే థియేటర్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ పోస్టర్, మాస్ స్ట్రైక్ ని లాంచ్ చేయబోతున్నారు. దీంతో మహేష్ అభిమానుల నుంచి మోసగాళ్ళకి మోసగాడు సినిమాకి మే 31న మంచి ఆదరణ లభించే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోసగాళ్ళకి మోసగాడు సినిమా సక్సెస్ గురించి ఆ నాడు ఎన్టీఅర్ రాసిన లేఖని జత చేసి పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ తో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేకంగా స్మరించుకుంటూ నివాళి అర్పించారు. ఇక ఈ లేఖలో ఆ సోదరుడు కృష్ణ తీసిన మోసగాళ్ళకి మోసగాడు చిత్రాన్ని చూడటం జరిగింది.

ఈ చిత్రాన్ని అద్భుతమైన సాంకేతిక విలువలతో నిర్మించాలన్న తపన ప్రతి ఫ్రేమ్ లో, ప్రతి సీన్ లో స్పష్టంగా కనిపించింది. తెలుగు భాషలో చూస్తోన్న ఇంగ్లీష్ చిత్రంగా అనిపించింది. ముఖ్యంగా చాయాగ్రాహకుడు ప్రతిభ అమోఘం అని చెప్పాలి. అలాగే కథను అనూహ్యమైన వేగంగా రూపించింది దర్శకుడు శ్రీదాసు ప్రశంసాపాత్రుడు.

సాంకేతికతతో ఇలాంటి అద్భుతమైన కళాఖండాలని కృష్ణ అభిమానులకి మరిన్ని అందించగలరని ఆశిస్తూ, సాహసోపేతమైన ఈ చిత్ర నిర్మాణ కృషిని అభినందిస్తున్నాము అని ఎన్టీఆర్ లేఖలో రాసుకొచ్చారు. ఈ లేఖని పోస్టర్ లో జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ పోస్టర్ ని అటు సూపర్ స్టార్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేస్తున్నారు.