Begin typing your search above and press return to search.

శ్రీజ ప్రేమ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు కుట్ర కోణం!

By:  Tupaki Desk   |   26 Jan 2020 5:30 PM GMT
శ్రీజ ప్రేమ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు కుట్ర కోణం!
X
మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ కుమార్తె శ్రీజ ప్రేమ విష‌యం అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. శిరీష్ భ‌ర‌ద్వాజ‌ను శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకుంది. త‌ర్వాత కొన్నాళ్లకే మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఇద్ద‌రు విడిపోయారు. అటుపై శ్రీజ బిజినెస్ మేన్ క‌ళ్యాణ్‌ దేవ్ ని వివాహమాడిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం మెగా కుటుంబం ఎలాంటి క‌ల‌త‌లు లేకుండా సంతోషంగా ఉంది. అయితే ఏపీ రాజ‌కీయాల‌లో తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో న‌టుడు.. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌.. వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి శ్రీజ ప్రేమ వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి కుట్ర కోణంపైనా కూపీ లాగుతూ మాట్లాడ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

శ్రీజ ప్రేమ విష‌యంలో చంద్ర‌బాబు పెద్ద కుట్ర చేసార‌ని...అత‌నొక ద‌గాకోరు అని పోసాని వ్యాఖ్యానించారు. చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించి ప్ర‌జ‌ల్లో తిరుగుతున్న స‌మ‌యంలో ఆ పార్టీని..చిరంజీవిని ఉద్దేశించి నీచ‌మైన వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు పోసాని గుర్తు చేసారు. ``నిజం చెప్పండి చంద్ర‌బాబు గారూ... చిరంజీవి గారి అమ్మాయి పెళ్లి విష‌యంలో...ప్రేమ విష‌యంలో మీరు కామెంట్ చేయ‌లేదా? ఇంట్లో ఆడ‌వాళ్ల‌ని కంట్రోల్ చేయ‌లేని వాడు దేశాన్ని..రాష్ట్రాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడ‌ని మీ నేత‌ల‌తో ప‌బ్లిక్ లో అనిపించ‌లేదూ?`` అంటూ పోసాని స్వ‌రం వినిపించారు.

``నీ కుళ్లు రాజ‌కీయాల కోసం దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేయించ‌లేదా? రెండు మూడు నెల‌ల పాటు మెగాస్టార్ టార్గెట్ గా అదే ప‌నిలో లేవా నీవు? ఒక‌వేళ నిజంగా నీవు అలా చేయ‌క‌పోయి ఉంటే అవి త‌ప్పుడు వ్యాఖ్య‌లు అని ఖండిచేవాడివి. కానీ ఖండించ‌లేదు. ఎందుకంటే ఆ వ్యాఖ్య‌లు నీ నోట రాక‌పోయినా..నీ ఉద్దేశం అదే`` అంటూ పోసాని తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. ``బాబూ త‌ప్పును త‌ప్పు అని చెప్ప‌లేని అస‌మ‌ర్ధ పాల‌కుడివి. నా ఇంట్లో కూడా ఆడ‌పిల్లలున్నారు. నా భార్య కూడా ఆడ‌దేన‌ని నువ్వు అన్నావా? చిరంజీవి సెన్సిటివ్ కాబ‌ట్టి అత‌న్ని అన్ని ర‌కాలుగా ఇబ్బంది పెట్టావ్. ఇక నీ ఆట‌లు చెల్ల‌వు. నీకు త‌గ్గ మొగుడు వ‌చ్చాడు`` అంటూ పోసాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.