యువ క్రియేటర్ ని పొగిడేసిన జక్కన్న-తారక్

Mon Oct 18 2021 23:00:01 GMT+0530 (IST)

Popular YouTuber gets a Thumbs up from Jr NTR

యుట్యూబ్- డిజిటల్ ప్రపంచానికి భువన్ బామ్ పరిచయం అవసరం లేదు. `BB కి వైన్స్` తో అతడికి గొప్ప ఖ్యాతి దక్కింది. భువన్ ఉత్తర భారతదేశంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న మల్టీట్యాలెంటెడ్ పర్సనాలిటీ. ఇటీవల అతను తన కొత్త వెబ్ సిరీస్ `ధిందోరా`తో మరింతగా ఫాలోయింగ్ ని సంపాదించాడు. డిజిటల్ లో ఎదురే లేని ప్రతిభావంతుడిగా నిరూపించుకుంటున్న అతడిపై దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.దిందోరా సిరీస్ యూనిక్ స్టైల్లో క్రియేటివ్ కంటెంట్ తో సాగుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే భువన్ ఇందులో తొమ్మిది పాత్రలను భవన్ క్రియేట్ చేసారు. అతను దానికి కథ- స్క్రీన్ ప్లే- సంభాషణలు కూడా రాశాడు. నేపథ్య సంగీతం కూడా కంపోజ్ చేసాడు. మూడు పాటలకు లిరిక్స్ రాసాడు. ట్రైలర్ విడుదల కాగానే..  అది వీక్షించిన దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. భువన్ అటువంటి ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో ముందుకు వచ్చినందుకు చాలా పాత్రలు చేసినందుకు ప్రశంసించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యూట్యూబ్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు. సొంతంగా ఇంత పెద్ద సిరీస్ సృష్టించినందుకు భువన్ ను ఆయన అభినందించారు. ``ఎలాంటి  మార్గదర్శకత్వం లేని ఢిల్లీకి చెందిన ఒక బాలుడి జీవన శైలి పాత్రల తీరుతెన్నులతో #దిందోరా మొత్తం ప్రదర్శనను ఎలా సృష్టించగలిగాడో చూడటం ఆశ్చర్యంగా ఉంది ..  సిరీస్ ని చూడండి..`` అంటూ తారక్ ట్వీట్ చేశారు.

దిండోరా మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14 న ప్రదర్శితమైంది. ఇది నాలుగు రోజుల కంటే తక్కువ వ్యవధిలో 22 మిలియన్లకు పైగా వీక్షణలను సాధించింది. అంతకుముందు బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తన ట్విట్టర్ హ్యాండిల్ లో దిండోరా పోస్టర్ ను పంచుకున్నారు. భువన్ బామ్ తన ఛానెల్ లో తాను సృష్టించిన అన్ని పాత్రలతో ఒక ప్రదర్శన చేయడం ఆసక్తికరం. ఈ తరహాలో భారతదేశంలోని మొదటి కంటెంట్ సృష్టికర్త అని విన్నాను. ప్రేక్షకుల కోసం కొత్త ఆలోచనలు తెచ్చే యువ ప్రతిభను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అతడికి శుభాకాంక్షలు`` అని అన్నారు. ఒక యూట్యూబ్ స్టార్ కి బాహుబలి దర్శకుడి ప్రశంసలు.. ఆర్.ఆర్.ఆర్ స్టార్ ప్రశంసలు దక్కాయంటే ఆషామాషీ కానేకాదు. అతడిలో అంతటి గొప్ప ప్రతిభ దాగి ఉందని దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. రాజమౌళి - తారక్ ప్రమోషన్స్ తో బామ్ కి క్రేజు అమాంతం పెరిగిందనే చెప్పాలి.