Begin typing your search above and press return to search.

ఫ్లాప్స్ ఎఫెక్ట్.. డ్యామేజ్ కంట్రోల్ మోడ్!

By:  Tupaki Desk   |   10 Oct 2019 8:07 AM GMT
ఫ్లాప్స్ ఎఫెక్ట్.. డ్యామేజ్ కంట్రోల్ మోడ్!
X
ఎవరైనా సక్సెస్ వెంటే పరుగులు తీస్తారు. అది లోకం తీరు. ఫిలిం ఇండస్ట్రీ అందుకు ఎక్సెప్షన్ ఏమీ కాదు. ఈమధ్య కొన్ని పేరుమోసిన బ్యానర్లు ఫ్లాపులదెబ్బకు తమ బిజినెస్ మోడల్ ను మార్చుకునే దిశగా ప్రయత్నాలు ప్రరంభించాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలాంటి బ్యానర్ లలో ఏకే ఎంటర్టైన్మెంట్స్.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఉన్నాయట. రీసెంట్ గా ఈ లిస్టులోకి మైత్రీ కూడా వచ్చి చేరిందని సమాచారం.

అంటే ఈ సంస్థలు నిర్మించినవాటిలో హిట్స్ లేవని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఫ్లాపుల హీటు ఈ సంస్థలకు బాగా తగులుతోందట. గతంలో హిట్లకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న ఈ బ్యానర్ల నుంచి ఇప్పుడు సినిమా వస్తుందంటే చాలు మరో ఫ్లాప్ వస్తుందేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి. సరైన కంటెంట్ ను ఎంచుకోక పోవడం.. ఒకవేళ మంచి కంటెంట్ ఉన్నా బడ్జెట్ ఎక్కువ పెట్టి కాస్ట్ ఫెయిల్యూర్ కావడం.. ఇలా జరగడంతో ఈ సంస్థల క్రెడిబిలిటీ కూడా దెబ్బతిన్నదని ప్రేక్షకులు కూడా అంటున్నారు. ఈ విషయాలన్నీ నిర్మాతలు గ్రహించారని.. ఇప్పటికే నష్టనివారణ చర్యలు మొదలు పెట్టారని అంటున్నారు.

స్క్రిప్ట్ పక్కాగా ఉంటేనే ఆ ప్రాజెక్ట్ తో ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. గతంలో కంటే బడ్జెట్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలని.. హీరో మార్కెట్ కుమించి బడ్జెట్ ఖర్చుపెట్టడంపై కూడా పునరాలోచిస్తున్నారని సమాచారం. ఈమధ్య రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని యావరేజ్ అయినప్పటికీ ఓవర్ బడ్జెట్ వల్ల ఫ్లాప్ ముద్ర వేయించుకోవాల్సి వచ్చింది. ఇవే కాకుండా పలు ఇతర విషయాలపై కూడా తమ నిర్మాణ సంస్థలలో ప్రక్షాళన మొదలు పెట్టారట. మరి ఈ చర్యలు సత్పలితాలనిస్తాయో లేదో తెలియాలంటే మనం కొంతకాలం వేచి చూడకతప్పదు.