Begin typing your search above and press return to search.

నా వీడియోలు వాడేస్తూ నన్నే బెదిరిస్తారా?

By:  Tupaki Desk   |   16 Feb 2020 11:30 PM GMT
నా వీడియోలు వాడేస్తూ నన్నే బెదిరిస్తారా?
X
బోల్డ్ బ్యూటీ పూన‌మ్ పాండే ఆన్ లైన్ వీడియోల‌కు ఉండే గిరాకీ తెలిసిందే. న్యూడ్ కంటెంట్ ని పోస్ట్ చేస్తూ ప్ర‌త్యేకించి ఒక యాప్ ని ర‌న్ చేస్తోంది. తాజాగా ఈ యాప్ కి సంబంధించిన ఓ కాంట్రాక్ట్ విష‌యంలో బిజినెస్ మేన్ రాజ్ కుంద్రా ఆయ‌న అనుచ‌రుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌న వీడియో కంటెంట్ పై కాంట్రాక్ట్ ముగిసినా చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నారని పూన‌మ్ పాండే ఆరోపించింది. ఎనిమిది నెల‌లుగా ఈ తంతు సాగిస్తున్నార‌ని త‌న‌కు పైసా కూడా ముట్ట‌లేద‌ని తెలిపింది. ఆ ఇద్ద‌రికీ చాట్ లు.. మెసేజ్ చాట్ లు చేశాన‌ని.. మెయిల్ ద్వారా ఈ విష‌యంపై నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశాన‌ని పూన‌మ్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

అయితే కుంద్రా అతని సహచరుడు సౌరభ్ కుష్వా ఇద్ద‌రూ పాండే ఆరోపణను ఖండించారు. అలాగే తమకు ఎలాంటి కోర్టు నోటీసులు రాలేదని కూడా పేర్కొన్నారు. కుంద్రా .. అతని సహచరులతో ఆర్మ్స్ ప్రైమ్ మీడియాని ప్రారంభించి దానికి పూన‌మ్ పాండే యాప్ ద్వారా ప్ర‌చారం చేసుకుంటున్నారు. అందుకు పూన‌మ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ డీల్ పూర్త‌యినా అన‌ధికారికంగా త‌న వీడియోల్ని మిస్ యూజ్ చేస్తున్నార‌నేది పూన‌మ్ ఆరోప‌ణ‌.

కుంద్రా త‌న వీడియో కంటెంట్ ను విచ్చ‌ల‌విడిగా ఉపయోగిస్తున్నాడని.. దాంతో డబ్బు సంపాదిస్తున్నాడ‌ని పాండే ఆరోపించింది. గత ఆరు నెలలుగా తనకు ఎన్నో అశ్లీల కాల్స్ వస్తున్నాయని స‌ద‌రు నటి పేర్కొంది. కంపెనీ (ఆర్మ్స్‌ప్రైమ్) నా పేరును ఉప‌యోగించుకుంటోంది. కొంత మోసం జరుగుతోందని వార్త‌ల్లో చదివాను. కాంట్రాక్టును ముగించాక కూడా గత ఎనిమిది నెలలుగా నా వీడియోలను ఎందుకు దొంగిలిస్తున్నారు? నా వీడియోల‌ను ఆపేయాలన్న అభ్యర్థనతో నేను రాజ్ కు ఫోన్ లు చేసి మెసేజ్ చేస్తున్నాను. కానీ రాజ్ కుంద్రా నుండి నాకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయి అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆర్థిక క‌ష్టాల వ‌ల్ల నా వీడియోల్ని దొంగిలించి వాడుకుంటున్నాడా? అయితే నేను ఆదుకుంటాను. ధ‌న‌సాయం చేస్తాను. కానీ నా కంటెంట్ ని మాత్రం దొంగిలించ‌వ‌ద్దు! అంటూ పూన‌మ్ డైరెక్టుగా కుంద్రాని టీజ్ చేసింది. త‌నని సంప్ర‌దించండి అంటూ వ్యక్తిగత నంబర్ ను కూడా పోస్ట్ చేసింది ``నన్ను పిలవండి.. నేను మీ కోసం స్ట్రిప్ (బ‌ట్ట‌లు విప్పేస్తా) చేస్తాను`` అని పూన‌మ్ ఘాటుగానే ప్రిపేరైంది. త‌న ఆరోప‌ణ‌ల‌కు ప్రూఫ్ గా ఆర్మ్స్‌ప్రైమ్ మీడియా అధికారిక ప్రకటనను కూడా పూన‌మ్ ఈ సంద‌ర్భంగా మీడియాకు చూపించింది.

అయితే కుంద్రా టీమ్ వెర్ష‌న్ మాత్రం పూర్తిగా వేరేగా ఉంది. పూనమ్ పాండే చేసిన ఆరోపణలు అబద్ధాలే. పైగా పనికిమాలినవి. మాకు ఎటువంటి నోటీసు లేదా రిట్ పిటిషన్ కాపీ కూడా రాలేదు. మేము కూడా అలాంటి పిటిషన్ కు రెడీ. పూన‌మ్ తో అధికారిక‌ ఒప్పందం ప్రకారమే మా హక్కులను వినియోగించుకుంటున్నాం. ఈ విషయం హైకోర్టులో తేల్చుకుంటాం. రాజ్ ఆర్మ్స్ ప్రైమ్ లో పెట్టుబడిదారుడు కాబట్టి.. క్రిమినల్ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా పూన‌మ్ డబ్బు దోచేయాల‌ని చూస్తోంది!! అంటూ ప్ర‌త్యారోప‌ణ‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టుల ప‌రిధిలో ఉంది. ఎవ‌రికి వారు మేం గెలుస్తాం అంటే మేమే గెలుస్తాం! అన్న ధీమాతో ఉన్నారు.