Begin typing your search above and press return to search.

నడుము అందాలతో సెగలు రేపుతున్న ముంబై సుందరి!!

By:  Tupaki Desk   |   5 Aug 2020 2:30 AM GMT
నడుము అందాలతో సెగలు రేపుతున్న ముంబై సుందరి!!
X
ముంబై భామ పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2005లో 'మొదటి సినిమా' అనే సినిమాతో వెండితెర పై అరంగేట్రం చేసింది. అదే తన ఫస్ట్ తెలుగు సినిమా. మొదటి సినిమా పర్వాలేదు అనిపించినా బ్యూటీకి తెలుగులో వరుసగా అవకాశాలు లభించాయి. ఎప్పుడైతే తెలుగులో స్లో అయిందో.. అప్పటి నుండి తమిళ, కన్నడ, మళయాళ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది. కెరీర్ ప్రారంభమై దాదాపు 15యేళ్లు అవుతున్న పూనమ్ కు ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. సైడ్ క్యారెక్టర్ తో పరుగు మూవీలో కనిపించిన తర్వాత తెలుగనాట మళ్లీ కనిపించలేదు ఈ ముద్దుగుమ్మ. కానీ తన అందం.. అభినయంతో అభిమానులను అలరిస్తుంది. మొదట్లో పూనమ్ పక్కింటి అమ్మాయిలా కనిపించింది. ఇక వరుస సినిమాలతో జోరుమీద ఉన్నప్పుడే గ్లామర్ పాత్రలు చేస్తూ.. అందాలు ఆరబోసింది.

ఎంత అందం గుప్పించినా అమ్మడు తెలుగులో మాత్రం నిలబడలేదు అనేది నిజం. అటు తమిళంలో బిజీ అయ్యాక కన్నడ, మలయాళం సినిమాలలో కూడా మెరిసింది. ప్రస్తుతం పూనమ్ అందాలను ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉండటానికి ట్రై చేస్తుంది భామ. మతిపోయే ఫోటోషూట్లతో, అదిరిపోయే ఫోజులతో అందాలను వడ్డిస్తుంది. తాజాగా అమ్మడు నడుము చూపిస్తూ దర్శనమిచ్చింది. అమాయకత్వంతో అలా నిలబడి నడుము అందాలు ఫోజిచ్చే సరికి అభిమానులలో సెగలు రేపుతున్నాయట. పూనమ్ పోజు జీన్స్ టి-షర్ట్ పోజు చూస్తే మళ్లీ రొమాన్స్ కి రెడీ అన్నట్లుగా అనిపిస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. చూడాలి మరి మళ్లీ ఈ ముంబై అందం తెలుగునాట మెరుస్తుందేమో..!