Begin typing your search above and press return to search.

అంతా ఆ టెన్ష‌న్ లో ఉంటే క్యూటీ టెంప్టింగేమిటో

By:  Tupaki Desk   |   14 July 2020 6:10 AM GMT
అంతా ఆ టెన్ష‌న్ లో ఉంటే క్యూటీ టెంప్టింగేమిటో
X
అందానికి అందం .. న‌టించే తెగువ ఉన్నా కొంద‌రికి కాలం క‌లిసి రాదు. ఆ కోవ‌కే చెందుతుంది పూన‌మ్ బ‌జ్వా. ఈ అమ్మ‌డు టాలీవుడ్ లో ఎంత గ‌ట్టిగా ప్ర‌య‌త్నించినా స‌రైన ఆఫ‌ర్లు రాలేదు. బాస్ నాగార్జున స‌ర‌స‌న ఆఫ‌ర్ వ‌చ్చినా కానీ ఆ త‌ర్వాత ఎందుక‌నో ఇక్క‌డ క‌నీస‌మాత్రంగా అయినా అవ‌కాశాలివ్వ‌లేదు. ప్ర‌స్తుతం మాలీవుడ్ మాత్ర‌మే దిక్కు అయ్యింది. అక్క‌డ‌ మోహ‌న్ లాల్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవ‌కాశం ద‌క్క‌డంతో అంతో ఇంతో ఫోక‌స్ అయ్యింది.

ప్ర‌స్తుతం పూన‌మ్ బ‌జ్వా ఏం చేస్తోంది? అంటే స‌రైన ఆన్స‌ర్ లేదు. 2019లో ఎన్టీఆర్ బ‌యోపిక్ `క‌థానాయ‌కుడు`లో అతిథి పాత్ర‌లో మెరిసింది. అలానే త‌మిళంలో `కుప్ప‌తు రాజా` అనే చిత్రంలో న‌టించింది. జీవీ ప్ర‌కాష్ స‌ర‌స‌న న‌టించిన ఈ సినిమాకి కొరియోగ్రాఫ‌ర్ బాబా భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కానీ అది కూడా మైలేజ్ ని ఇవ్వ‌లేదు. త‌మిళం-మ‌ల‌యాళం-క‌న్న‌డం- తెలుగు అన్ని భాష‌ల‌కు ప‌రిచ‌యం ఉన్నా లేటెస్ట్ గా ఆఫ‌ర్ ఏదీ రాలేదు.

ఆ క్ర‌మంలోనే ఈ క్వారంటైన్ టైమ్ ని పూన‌మ్ ఇంట్లోనే స్పెండ్ చేస్తోంది. ట్విట్ట‌ర్ ఇన్ స్టా వేదిక‌ల‌పై నిరంత‌రం జిమ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు అప్ లోడ్ చేస్తోంది. నేను ఎంతో నేచుర‌ల్ .. న‌న్ను క‌ల‌వ‌డానికి ఓ అతిధి వ‌చ్చింది ఎవ‌రో తెలుసా? అంటూ ఓ ఈగిల్ ఫోటోని షేర్ చేసిన అమ్మ‌డు ప్ర‌స్తుతానికి ఫ‌జిల్స్ వేస్తూ కాల‌యాపన చేస్తోంది.

తాజాగా పూన‌మ్ షేర్ చేసిన ఓ ఫోటో సంథింగ్ స్పైసీగా యూత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ముఖ్యంగా పూన‌మ్ ఏ ఫోటోని షేర్ చేసినా ఇలా నాభి అందాల‌తో స్పెల్ బౌండ్ చేసేస్తోంది. క‌నీసం ఈ ప్ర‌య‌త్నం చూసైనా ఎవ‌రైనా ఆఫ‌ర్ ఇస్తారా అంటే... ఏమో.. చెప్ప‌లేం. అయినా రాంగ్ టైమ్ లో ఏం చేస్తే ఏం లాభం? మ‌హ‌మ్మారీ గురించి ఆలోచిస్తూ టెన్ష‌న్ ప‌డుతుంటే ఎవ‌రు ఎంత టెంప్ట్ చేసినా ప‌ట్టించుకునే ఆస‌క్తి ఎవ‌రికైనా ఉంటుందా?