పూనమ్ బజ్వా హాటెస్ట్ ఈత కొలను బికినీ

Wed Aug 17 2022 23:33:01 GMT+0530 (IST)

Poonam Bajwa Bikini Photo Shoot

టాలీవుడ్ టు మాలీవుడ్ పూనమ్ బజ్వా పరిచయం అవసరం లేదు. ఇరు పరిశ్రమల్లోనూ అగ్ర హీరోల సరసన ఈ బ్యూటీ నటించింది. నాగార్జున - మోహన్ లాల్ లాంటి పాపులర్ హీరోల సినిమాల్లో నాయికగా నటించిన ఈ బ్యూటీ యువహీరోల సరసనా నటించింది.  
`ఎన్టీఆర్ కథానాయకుడు` చిత్రంలో ఒక అతిథి పాత్రలోనూ కనిపించింది. రకరకాల కారణాలతో టాలీవుడ్ పూనమ్ కి ఆశించినంతగా కలిసి రాలేదనే చెప్పాలి.  తెలుగులో` మొదటి సినిమా`తో నటిగా పరిచయమైంది. కానీ అది బిగ్ ఫ్లాపైంది. నాగార్జున బాస్ కూడా తనకు ప్లస్ కాలేదు. అటు పై మరికొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మాలీవుడ్ లో బిజీ అయ్యింది. ఇప్పటికీ అక్కడ సినిమాల్లో నటిస్తోంది.ప్రస్తుతానికి మలయాళంలో ఓ రెండు చిత్రాల్లో నటిస్తోంది. మై హూమ్ మూసా చిత్రీకరణలో ఉంది. అలాగే వినయన్ దర్శకత్వంలో `పతోన్ పంతం నూట్టండు` అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇది అత్యంత భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతోంది.

ఇటీవల ఈ బబ్లీ బ్యూటీ సోషల్ మీడియాల్లో స్పీడ్ చూపిస్తోంది. టెంప్టింగ్ ఫోటోలతో ఆకట్టుకుంటోంది. అందాల ఆరబోతను పూనమ్ కాస్త బ్యాలెన్స్ చేస్తున్నా హాట్ కంటెంట్ ఎలివేషన్ లో ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా పూనమ్ పూల్ సైడ్ బికినీ యాక్ట్ అభిమానుల్లో వైరల్ గా మారింది. మునుపటితో పోలిస్తే ఈ భామ మరింత హాట్ గా కనిపిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ లో రకరకాల భంగిమల్లో పూనమ్ ఫోజులివ్వగా అవి వైరల్ గా మారుతున్నాయి.

పూనమ్ చబ్బీ లుక్ లోనూ ఎంతో అందంగా కనిపిస్తోంది! పూల్ సైడ్ ట్రీట్ అదిరింది! అంటూ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని సమాచారం. ఐటమ్ నంబర్లతోనూ అలరించేందుకు సిద్ధమేనని సిగ్నల్స్ ఇస్తోందిలా.