విజయ్ దేవరకొండతో పక్కా అంటున్న బుట్టబొమ్మ!

Sat May 14 2022 13:16:30 GMT+0530 (IST)

Pooja hegde on vijay devarakonda

పూజ హెగ్డేకి కొంచెం దిష్టి తగిలినట్టే ఉంది .. లేకపోతే వరుసబెట్టి తన భారీ సినిమాలన్నీ బెలూన్స్ మాదిరి పేలిపోతాయా?ప్రభాస్ సరసన పూజ హెగ్డేకి ఛాన్స్ తగిలినప్పుడు మిగతా అందగత్తెలంతా అసూయ పడ్డారు. ఆ తరువాత విజయ్  సరసన నాయికగా 'బీస్ట్'లో ఛాన్స్ కొట్టేసినప్పుడు అవసరానికి మించి అసూయపడ్డారు. అంతే .. పాపం ఆ రెండు సినిమాలు ఆమెకి కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్  కాలేకపోయాయి. పోతే పోయాయిలే అని సరిపెట్టుకోవడానికి అవి చిన్న సినిమాలు కావాయే. పాన్ ఇండియా సినిమాలు ఊరించినట్టే ఊరించి ఉఫ్ మంటూ ఊదేశాయే అనుకుంది.

అటు 'రాధే శ్యామ్' .. ఇటు 'బీస్ట్' ఈ రెండు భారీ సినిమాలు పోయినప్పటికీ 'ఆచార్య' అండగా ఉంది కదా అని పూజ సరిపెట్టుకుంది. 'నీలాంబరి' పాత్ర తనకి మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందని అనుకుంది. కానీ ఆమె ఆశలపై ఐస్ నీళ్లు చల్లినట్టుగా అయింది. ఇలా చెప్పుకోదగిన మూడు ప్రాజెక్టులు చాలా తక్కువ గ్యాపులో చతికిల పడ్డాయి. ఈ సినిమాల పరాజయానికి ఎవరు కారకులు  .. ఏం జరిగిందనే పరిశోధనలు  చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. కానీ వాటితో ప్రేక్షకుడికి పనిలేదని గ్రహించి సైలెంట్ అయ్యారు.  

ఈ సినిమాలు ఫ్లాప్ కావడం పూజ హెగ్డేకి కెరియర్ కి కొంత ఇబ్బందిని కలిగించేదే అయినా అదృష్టం కొద్దీ ఆమె త్రివిక్రమ్ -   మహేశ్ మూవీలో చేసే అవకాశాన్ని దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్  పైకి వెళ్లనుంది.

ఇక ఆ తరువాత  పవన్ సరసన ఆడిపాడనుందనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. పవన్ తో హరీశ్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ జోడీగా కూడా ఆమె ఛాన్స్ కొట్టేసిందనేది తాజా సమాచారం.

విజిట్ దేవరకొండ హీరోగా పూ రి జగన్నాథ్  'లైగర్' సినిమా రూపొందింది. ఆగస్రు 25వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఆ తరువాత కూడా పూరి -  కరణ్ జొహార్ కాంబినేషన్లో విజయ్ దేవరకొండ   ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు.

ఈ సినిమాకి 'జన గణ మన' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా కోసం ముందుగా జాన్వీ కపూర్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా పూజ హెగ్డే పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఆమె ఈ ప్రాజెక్టు పై సైన్ చేయడం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు. ఆమె ఖాతాలో మరో పాన్ ఇండియా ప్రాజెక్టు చేరిపోయిందనే చెప్పుకోవాలి.