అమ్మడికి ఫాలోయింగే కాదు.. అండ కూడా అదే రేంజిలో ఉందిగా..!

Fri May 29 2020 19:00:33 GMT+0530 (IST)

Not Only following...Support is also there

బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పూజా హెగ్డేకి రోజురోజుకి తెలుగు అభిమానుల ఫాలోయింగ్ తో పాటు అభిమానుల అండ కూడా గణణీయంగా పెరిగిపోతుంది. ఎలా అనుకుంటున్నారా.. బేబీ అందాలకు కొందరు ఫాలో అయితే మరికొందరేమో పూజాకి ఏదైనా సమస్య రాగానే సపోర్ట్ గా నిలుస్తున్నారు. తాజాగా పూజా అభిమానులు రుజువు చేశారు కూడా.. ఇటీవలే పూజాకి సమంత అభిమానులకు మధ్య పెద్ద ట్విట్టర్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. మాటలకు మాటలే.. కౌంటర్లకు కౌంటరే సమాధానం అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఓ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా.. సమంత అభిమానులకు పూజా క్షమాపణ చెప్పాలని PoojaMustApologizeSamantha అనే హాష్ ట్యాగ్ తో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. పూజా ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ‘మజిలీ’ సినిమాలో సమంతకు సంబంధించిన ఓ స్టిల్ ఉండగా.. దానికి ‘ఆమె నాకు పెద్ద అందంగా కనిపించలేదు’ అనే కామెంట్ కనిపించింది.దీంతో సమంత ఫ్యాన్స్ ఫైర్ అయి పూజా హెగ్డే పై దాడికి దిగారు. ఇక విషయం తెలుసుకున్న పూజా ఫ్యాన్స్ ఊరుకుంటారా.. WeSupportPoojaHegde హ్యాష్‌ట్యాగ్‌తో పూజా ఫ్యాన్స్ భారీ మద్దతు పలుకుతూ ముందుకు వస్తున్నారు. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్స్ కాస్త ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. ఇది తెలిసి వెంటనే రంగంలోకి దిగిన పూజా.. ట్విట్టర్‌లో స్పందించి.. ”తన ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందని తన టీమ్ కష్టపడి మళ్లీ సరిచేశారని” చెప్పింది. అయినా ఆ సమాధానం సమంత అభిమానుల కోపాన్ని చల్లార్చలేక పోయిందట. అయితే అటు పూజా ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగి బుట్టబొమ్మకు మద్దతును తెలుపుతుండటంతో వీరిరువురి ఫ్యాన్స్ మధ్య వార్ ప్రస్తుతం రచ్చ చేస్తోంది. కానీ పూజా ఫ్యాన్స్ మాత్రం పూజాకే షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇలా కూడా తనకు అండగా నిలుస్తారని ఎక్సపెక్ట్ చేయలేదట. అందుకే ఆశ్చర్యంతో కూడిన ఆనందం పొందినట్లు సమాచారం.