క్లిక్ క్లిక్ : యోగా భంగిమలతో మత్తెక్కిస్తోంది

Sat Jul 11 2020 19:36:16 GMT+0530 (IST)

Click-click: Yoga poses with postures

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. గత నాలుగు నెలుగా షూటింగ్స్ లేకపోవడంతో ఫిజిక్ పై దృష్టి పెట్టింది. లావు కాకుండా ఉండటంతో పాటు చాలా మరింత దృడంగా మారేందుకు పూజా హెగ్డే ఎక్కువ సమయం వర్కౌట్స్ కు సమయం కేటాయిస్తుందట. ఇదే సమయంలో ఆమె యోగా కూడా చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ లు పెడుతూ చెప్పకనే చెబుతోంది. తాజాగా మరోసారి తన యోగా ఫొటోలను నెట్టింట షేర్ చేసిన పూజా హెగ్డే ఫ్యాన్స్ కిక్కిస్తోంది.రెండు ఫొటోలు షేర్ చేసిన పూజా హెగ్డే అత్యంత కఠినమైన యోగా భంగిమని చాలా సులభంగా వేసి చూపించింది. ఆ భంగిమలో ఆమె అందం మరింత ఎక్కువ అయ్యిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యోగా పూర్తి అయిన తర్వాత కింద పడుకుని రిలాక్స్ అయిన ఫొటోను షేర్ చేసిన పూజా హెగ్డే మరింతగా ఫాలోవర్స్ ను రెచ్చగొడుతోంది.

మొత్తానికి పూజా హెగ్డే ఈ లాక్ డౌన్ లో ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక స్టిల్ తో దగ్గరగా ఉంటూనే ఉంది. ప్రస్తుతం ఈమె తెలుగులో ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ చిత్రాన్ని ఇంకా అఖిల్ తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రాలను చేస్తుంది. ఆ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కొత్త సినిమాలకు చర్చలు జరుగుతున్నాయట.