Begin typing your search above and press return to search.

భాయ్ తో బుట్ట‌బొమ్మ‌ రొమాన్స్ పీక్స్ లో!

By:  Tupaki Desk   |   24 Jun 2022 12:30 AM GMT
భాయ్ తో బుట్ట‌బొమ్మ‌ రొమాన్స్ పీక్స్ లో!
X
బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే వేగం ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇటీవ‌లే బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ ప‌డినా అమ్మ‌డి స్పీడ్ కి బ్రేకులు మాత్రం ప‌డ‌లేదు. 'రాధేశ్యామ్'.. 'బీస్ట్'..'ఆచార్య‌'తో హ్యాట్రిక్ ప్లాప్ లు ఖాతాలో వేసుకున్నా! వాటితో సంబంధం లేకుండా ముందుకు సాగిపోతుంది. అప్ప‌టికే క‌మిట్ మెంట్లు జ‌రిగిపోవ‌డంతో ఆ ప్రభావం ప‌డ‌లేద‌ని తెలుస్తోంది.

కొత్త అవ‌కాశాలు అదే రేంజ్లో నూ ఒడిసి ప‌ట్టుకుంటుంది. ఫెయిల్యూర్ ట్రాక్ ని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు అమ్మ‌డి వెంట ప‌డ‌టం విశేషంగానే భావించాలి. ఫేం ఉన్నంత కాల‌మే వెలుగు అన్న చందంగా ప్ర‌స్తుతం అమ్మ‌డు అన్ని భాష‌ల్ని దున్నేస్తోంది. తెలుగు..త‌మిళ్.. హిందీ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది.

ఇక పూజాలో రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పేదేముంది. బాలీవుడ్ డెబ్యూ మూవీ 'మోహంజ‌దారో'లో హృతిక్ రోష‌న్ తో ఏ రేంజ్ లో రొమాన్స్ పండించిందో తెలిసిందే. అందులో అమ్మ‌డి పెద‌వి మ‌ద్దులు వైనం ఇప్ప‌టికీ యువ‌త‌లో అగ్గిరాజేస్తూనే ఉంటుంది. ఇటీవ‌లే 'రాధేశ్యామ్' లోనూ అదే రేంజ్ లో చెల‌రేగింది. తాజాగా మ‌రోసారి ఆ రెండు సినిమాల్ని మించి స‌ల్మాన్ భాయ్ తో రొమాన్స్ కి రెడీ అవుతోందా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది.

ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ హీరోగా 'క‌భీ ఈద్ క‌భీ దివాలీ' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాయిక‌గా పూజాహెగ్డే న‌టిస్తోంది. ప‌ర్హ‌ద్ సాంజీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. నిన్న ..మొన్న‌టివ‌ర‌కూ హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌రిగింది. ఈ షెడ్యూల్ లో స‌ల్మాన్ తో పాటు.. పూజాహెగ్డే కూడా షూటింగ్ లో పాల్గొంది. అందుకోసం పూజా రెస్ట్ లెస్ గా ప‌నిచేసింది.

రాత్రిప‌గ‌లు తేడా లేకుండా షూట్ కి హాజ‌రైంది. స‌రిగ్గా నిద్ర లేక‌పోతే ముఖం పీక్కుపోతుంది. అలాంటి ఫోటోనే ఇన్ స్టా లో షేర్ చేసి త‌న క‌ష్టాన్ని చెప్పే ప్ర‌త‌య్నం చేసింది. అలాగే సినిమా రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్. ఇందులో భాయ్ తో రొమాంటిక్ స‌న్నివేశాలు ఘాటుగానే ఉంటాయ‌ని హింట్ ఇచ్చేసింది. పెద‌వి ముద్దులు ఎలాగూ కామ‌న్.

కానీ అవ‌స‌రం మేర కొన్ని ఇంటిమేంట్ స‌న్నివేశాలు యువ‌త‌లో గుబులు పెట్టించేలానే ఉంటాయ‌ని లీకులందుతున్నాయి. వాటిని ప్ర‌త్యేకంత‌గా స‌ల్మాన్-పూజా మ‌ధ్య కేవ‌లం రాత్రి స‌మ‌యంలోనే షూట్ చేసారుట‌. ద‌ర్శ‌కుడు.. సినిమాటోగ్రాఫ‌ర్మాత్ర‌మే ఆ స‌న్నివేశాల షూట్ స‌మ‌యంలో ఉన్నారుట‌.

అవి సినిమాలో ఎంతో వాస్త‌వికంగా ఉంటాయ‌ని..అలా క‌నిపించాల‌ని అంతే వాస్త‌వికంగా షూట్ చేసిన‌ట్లు లీకులు చెబుతున్నాయి. మ‌రి ఆ సంగ‌తేంటి? అన్న‌ది తేలాలంటే రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.