ప్రభాస్ 20 లీక్స్.. తొందరెందుకు పూజా?

Tue Sep 10 2019 11:00:01 GMT+0530 (IST)

Pooja Hegde on About Prabhas Jaan Movie

టీమ్ కి తెలియకుండా లీకులిస్తే అందుకు తగ్గట్టే పంచ్ పడుతుంటుంది. ఇటీవల కొన్ని క్రేజీ సినిమాలకు సంబంధించిన లీకులిచ్చేసి ఆపై దర్శకనిర్మాతలు చీవాట్లతో వెనక్కి తగ్గిన వాళ్లు ఉన్నారు. ఇంతకుముందు తన టీమ్‌కు తెలియకుండానే అనాలోచితంగా సినిమా టైటిల్‌ని బయటపెట్టేసి కార్తి టీమ్‌కి షాకిచ్చేసింది రష్మిక. సరిగ్గా అలాంటి పనే హాట్ బేబీ పూజా హెగ్డే చేసింది.ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్‌తో `అల వైకుంఠపురములో`.. వరుణ్‌తేజ్ తో `వాల్మీకి` చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా వాల్మీకి టీజర్ లో పూజా గ్లింప్స్ కుర్రకారు గుండెల్ని పట్టేశాయి. పూజా ఈ రెండు చిత్రాలతో పాటు ప్రభాస్ హీరోగా `జిల్` ఫేమ్ రాధాకృష్ణ రూపొందిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ `జాన్`(వర్కింగ్ టైటిల్)లోనూ నటిస్తోంది. యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ చాలా రోజుల క్రితమే మొదలైంది. ప్రభాస్ `సాహో` డీవియేషన్ వల్ల చిత్రీకరణ ఆలస్యం అవుతున్న జాన్ (ప్రభాస్ 20) రెగ్యులర్ షూటింగ్ మళ్లీ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని పూజా ఇటీవల ఓ మీడియా కిచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టేసింది.

చాలా రోజుల క్రిమే ఈ కథని రాధాకృష్ణ వినిపించారు. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుందని.. ఇందులో కొత్త ప్రభాస్ ని చూస్తారని అసలు విషయం చెప్పేసింది పూజా. చాలా కాలం తర్వాత ఒక గొప్ప స్క్రిప్టు విన్నాను. ఇందులో ట్విస్టులు మైమరిపిస్తాయని పూజా చెప్పింది. ఈ చిత్రాన్ని కూడా ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ ల్లో చేస్తున్నాడు ప్రభాస్. గోపి కృష్ణ బ్యానర్ తో కలిసి యువీ క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో భారీ అంచనాలేర్పడ్డాయి.