ఫోటో స్టొరీ: మహర్షి.. ఎర్ర మందారం

Sun May 19 2019 13:02:17 GMT+0530 (IST)

Pooja Hegde at Maharshi Movie Successmeet At Vijayawada

అందాల బొమ్మలా ఉండే పూజ హెగ్డేకి ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ డిమాండే ఉంది. ఇప్పటివరకూ తన ఖాతాలో నిఖార్సైన బ్లాక్ బస్టర్ అంటూ ఒక్కటీ లేదు కానీ డిమాండ్ మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది.  ఈమధ్య రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం 'మహర్హి' లో పూజా హెగ్డే హీరోయిన్ నటించిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా 'ఎపిక్ బ్లాక్ బస్టర్' అయిందని సినిమా రిలీజ్ అయిన రోజునుండే 'మహర్షి' టీమ్ సగర్వంగా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విజయోత్స వం జరిగింది.  ఏదో సాధారణ ఫంక్షన్లు.. సోషల్ మీడియా ఫోటోషూట్ల కోసమే అద్భుతంగా రెడీ అయ్యే పూజకు 'మహర్షి' సక్సెస్ సెలబ్రేషన్స్ అనగానే మరింత గొప్పగా తయారయింది.రెడ్ కలర్ డ్రెస్ లో ఫంక్షన్ కు ఒక రతీదేవిలా వచ్చి కుంటుంది.  ఎరుపు రంగు స్లీవ్ లెస్ ఛోళీ.. దానికి మ్యాచింగ్ గా అదే రంగు లెహెంగా ధరించింది. డీప్ వీ-నెక్ కావడంతో పూజ అందాల ప్రదర్శనకు అడ్డే లేకుండా పోయింది. ఇక ఈ డ్రెస్ కు మ్యాచింగ్ గా ఎరుపు రంగు చున్నీ ఉంది కానీ దాన్ని ఎంతో నైస్ గా అందాలకు అడ్డురాకుండా చేత్తో పట్టుకోవడంతో కెమెరాలకు అందాలకు మధ్య దూరం తరిగిపోయింది. డ్రెస్ కు సరిగ్గా సరిపోయేలా ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ ధరించింది. హెయిర్ స్టైలింగ్ చూసేందుకు నార్మల్ గా ఉన్నప్పటికీ పరిశీలించి చూస్తే గానీ దాని ప్రత్యేకత తెలియదు.  కుడి ఎడమలు రెండు పాయలలాంటి శిరోజాలు చెంపల మీద పడేలా గా స్టైలింగ్ చేశారు.  ఏదేమైనా తన అందంతో అలంకరణతో ఎర్రమందారంలా తయారై ఈవెంట్ లో అందరి దృష్టిని పూజ తన వైపుకు తిప్పుకుంది.

పూజ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధాకృష్ణ కుమార్ సినిమా.  ఇది కాకుండా బాలీవుడ్ లో 'హౌస్ ఫుల్ 4' లో కూడా నటిస్తోంది.