ఫోటో స్టొరీ: ఆ పూజ వేరు.. ఈ పూజ వేరు

Tue Sep 17 2019 11:06:20 GMT+0530 (IST)

Pooja Hegde as Sri Devi in Valmiki Movie

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వాల్మీకి'.  ఈ సినిమా సెప్టెంబర్ 20 న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో బ్యూటిఫుల్ పూజా హెగ్డే ఒక కీలక పాత్రలో నటించింది.  అంతే కాకుండా పాత సూపర్ హిట్ వెల్లువొచ్చి గోదారమ్మ రీమిక్స్ సాంగ్ లో వరుణ్ తో కలిసి స్టెప్పులేసింది.వరుణ్ తేజ్ గతంలో 'ముకుంద' సినిమాలో పూజా హెగ్డేతో జోడీ కట్టిన విషయం తెలిసిందే. 'వాల్మీకి' లో కలిసి నటించడం రెండోసారి.  ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో పూజా కనిపిస్తుందని సమాచారం.  ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే తన ఇన్స్టా ఖాతా ద్వారా శ్రీదేవి పాత్రకు సంబంధించిన ఒక స్టిల్ ను అభిమానులతో షేర్ చేసింది.  ఈ ఫోటోకు "అమాయకురాలే.. కానీ సాహసవంతురాలు.  శ్రీదేవి." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక 'వాల్మీకి' విడుదలకు మూడు రోజులే అంటూ కౌంట్ డౌన్ కూడా గుర్తు చేసింది.

పూజ ఈ పోస్టర్ లో లంగా జాకెట్ ధరించి.. ఒక్క జడ.. మెడలో సన్నటి బంగారు గొలుసు.. చెవులకు కమ్మలు.. నుదుటిన బొట్టుతో పూర్తిగా ట్రెడిషనల్ గా కనిపిస్తోంది. ఫేస్ కూడా ఇన్నోసెంట్ గా ఉంది.  ఈ పోస్టర్ తో పాటు  శ్రీదేవి పాత్ర ఇంట్రో పోస్టర్ ను కూడా షేర్ సింది.  పోస్టర్ లో పూజ చూడిదార్ ధరించి నేలపై కూర్చుని ఒక స్టూడెంట్ లా గా ఏదో పుస్తకాన్ని చదువుతోంది.  డ్రెస్ మోడరన్ గా ఉన్నా రెండు జడలు.. ఫేస్ లో ఇన్నోసెంట్ లుక్ మాత్రం సేమ్ టు సేమ్.

ఈ పూజా హెగ్డే..  'డీజె' లో బికినీ భామ పూజా హెగ్డే ఒకరేనా అని మనకు అనుమానం వచ్చేలా ఉంది.  ఈ ఫోటోకు ఇన్స్టా లో మంచి రెస్పాన్స్ వచ్చింది. "ఏయ్.. క్యూటీ".. "అమాయకత్వం 2.0".. "ఏంటి.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా?".. "బిందెల సాంగుకు వెయిటింగ్"..  అంటూ కామెంట్లు పెట్టారు.