ఫోటో స్టోరి: ఇల్లీ బేబీలానే పూజార్పణం

Tue Sep 17 2019 13:51:38 GMT+0530 (IST)

Pooja Hegde Spotted at Gym

సన్నజాజి సోయగం ఇలియానా సౌత్ కెరీర్ ఒక రేంజులో సాగింది. దశాబ్ధం పాటు ఎదురేలేని స్టార్ డమ్ ని ఆస్వాధించింది. ముంబై మోడలింగ్ బేస్ నుంచి వచ్చిన చాలా మంది భామల్లో గోవా బ్యూటీ ఇలియానా టాప్ రేంజ్ కెరీర్ ని సాగించిందనడంలో సందేహం లేదు. అయితే ఆ స్థాయిని అందుకోవడానికి కారణం అందం చందం.. షార్ప్ లుక్ ఒక్కటే కాదు.. గొప్ప నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆ స్థాయికి చేరుకోగలిగింది.ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో అంత సీన్ ఉత్తరాధి భామల్లో ఎవరికి ఉంది? అంటే కచ్ఛితంగా పూజా హెగ్డే తప్ప వేరొక ఆప్షన్ కనిపించడం లేదు. ఇలియానా తరహాలో సన్నజాజి నడుముతో ఈ అమ్మడు కుర్రకారు గుండెల్లో తిష్ఠ వేసి కూచుంది. `డీజే`లో 2 నిమిషాల స్విమ్ సూట్ యాక్ట్ తో కుర్రాళ్లకు కనెక్టయిపోయింది. చీరకట్టినా మోడ్రన్ డ్రెస్ లో కనిపించినా పూజా అందం కవ్విస్తుంది. అందుకే అంత ఇదిగా మన దర్శకనిర్మాతలకు డార్లింగ్ అయిపోయింది. ప్రస్తుతం వరుణ్ సరసన `వాల్మీకి` చిత్రంతో మరోసారి అభిమానులకు ట్రీటివ్వబోతోంది. సాంప్రదాయ చీరకట్టుతో కాలేజ్ కి వెళ్లే పల్లెటూరి అందగత్తెగా ఇప్పటికే ఈ అమ్మడి హొయలు మతి చెడగొడుతున్నాయి. ఈనెల 20న వాల్మీకి రిలీజవుతోంది.

అందుకు పూర్తి కాంట్రాస్ట్ లుక్ తో ఇదిగో ఇలా ముంబైలోని ఓ జిమ్ నుంచి బయటకు వస్తూ ట్రీటిచ్చింది. శరీరంలో అంగాంగాన్ని అతుక్కుపోయే టైట్ ఫిట్ స్పోర్ట్ డ్రెస్ లో పూజా ఇచ్చిన ట్రీట్ మామూలుగా లేదు. నైక్ బ్రాండ్ బ్లాక్ స్పోర్ట్స్ వేర్ లో అందాల ఎలివేషన్ వేడెక్కిస్తోంది. మేకప్ లేకుండా అలా స్మైలిస్తూ పూజా కవ్వింత ఆకట్టుకుంటోంది. వాల్మీకి ఈనెల 20న రిలీజవుతోంది. తదుపరి బన్ని- త్రివిక్రమ్ `అల వైకుంటపురములో` అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ముంబై టు హైదరాబాద్ ఈ అమ్మడి షెడ్యూల్స్ బిజీబిజీ.