ఫొటోటాక్‌ః పూజా హెగ్డే నెగటివ్ దరహాసం

Mon May 03 2021 12:00:01 GMT+0530 (IST)

Pooja Hegde Negative Laughter

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవలే కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. తనకు కరోనా పాజిటివ్ అంటూ వచ్చిందని పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా పేర్కొన్న విషయం తెల్సిందే. కరోనా బారిన పడ్డ పూజా హెగ్డే ఇంటికి పరిమితం అయ్యింది. పూర్తి విశ్రాంతి తీసుకుంటూ ప్రాణాయామా చేస్తూ కరోనా నుండి బయట పడింది. పూజా హెగ్డే కరోనా వల్ల ఎక్కువగా బాధపడలేదు. కాని ఆమె ఎన్నో విషయాలను నెటిజన్స్ కు తెలియజేసేందుకు ప్రయత్నించింది. తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఈ ఫొటోతో ఆమె కరోనాను జయించినట్లుగా అనిపిస్తుంది.కరోనా నెగటివ్ రావడం వల్ల ఆమె సంతోషంగా కనిపిస్తున్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఆమె షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. కాని ఈసారి ఆమె షేర్ చేసిన ఈ ఫొటో ఏకంగా మిలియన్ లైక్స్ ను దక్కించుకుంటుంది. రికవరీ మార్నింగ్ అంటూ ఈ ఫొటో ను షేర్ చేయడంతో చాలా మంది కరోనా బారి నుండి బయట పడ్డందుకు అభినందనలు అంటూ కామెంట్స్ చేశారు. పెద్దగా ఇబ్బంది పడకుండానే పూజా హెగ్డే కరోనాను జయించింది. ఆమె రెగ్యులర్ గా డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండటం వల్ల కరోనా ను ఈజీగా పూజా జయించిందని అంటున్నారు.

ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు తో పాటు తమిళం మరియు హిందీ భాషల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాధే శ్యామ్ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలతో రాబోతుంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ కి జోడీగా ఇటీవలే ఈమె ఎంపిక అయ్యింది. బాలీవుడ్ లో రెండు పెద్ద సినిమాల్లో ఈమె నటిస్తుంది. మొత్తంగా బిజీ హీరోయిన్ అయిన పూజా హెగ్డే కరోనా ను జయించి ఇలా నెగటివ్ రావడంతో దరహాసం తో నెట్టింట సందడి చేసింది.