Begin typing your search above and press return to search.

కోలకళ్ల పూజా హెగ్డేను కోలీవుడ్ వదిలిపెట్టదేమో!

By:  Tupaki Desk   |   18 May 2021 6:30 AM GMT
కోలకళ్ల పూజా హెగ్డేను కోలీవుడ్ వదిలిపెట్టదేమో!
X
పొన్నాగి పూలతో పోతబోసినట్టుగా కనిపించే నాజూకు కథానాయిక పూజా హెగ్డే. మంచి ప్లానింగుతో వరుస సినిమాలతో ఈ సుందరి దూసుకుపోతోంది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తున్న ఈ అమ్మాయి, అడపా దడపా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించి వచ్చేస్తోంది. తమిళంలో 'జీవా' హీరోగా చేసిన సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన పూజా హెగ్డే, ఆ తరువాత ఎక్కువగా తెలుగు సినిమాలే చేస్తూ వచ్చింది. మళ్లీ ఇంత కాలానికి ఆమె తమిళంలో విజయ్ జోడీగా ఆయన 65వ సినిమాలో నటిస్తోంది.

తమిళనాట విజయ కి గల క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతూ ఉంటాయి .. అదే స్థాయిలో వసూళ్లను రాబడుతూ ఉంటాయి. హీరోయిన్ల కెరియర్ కి కూడా ఆయన సినిమాలు చాలా హెల్ప్ అవుతుంటాయి. అలాంటి విజయ్ సరసన పూజా హెగ్డే మెరవనుంది. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే, ఆమెకి మరో భారీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ లోని ఓ బడా నిర్మాణ సంస్థ నుంచి ఈ ఆఫర్ వచ్చిందని చెప్పుకుంటున్నారు.

విక్రమ్ హీరోగా ఆ సంస్ధ ఒక సినిమాను ప్లాన్ చేస్తోందట .. 'హరి' ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. గతంలో హరి - విక్రమ్ కాంబినేషన్లో భారీ యాక్షన్ సినిమాలు వచ్చాయి. మాస్ ఆడియన్స్ ను అవి ఒక రేంజ్ లో అలరించాయి. మళ్లీ విక్రమ్ హీరోగా హరి ఒక కథను రెడీ చేసుకుని రంగంలోకి దిగుతున్నాడట. విక్రమ్ కి తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. అందువలన పూజా హెగ్డే ఓకే చెప్పేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.