మహేష్ కు మిల్కీ కాదు.. జిగేలు రాణి

Wed Sep 11 2019 13:01:38 GMT+0530 (IST)

Pooja Hegde Item Song In Mahesh babu Sarileru Neekevvaru Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.  ప్రస్తుతం జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.  సంక్రాంతి బరిలో దిగుతున్నారంటే స్ట్రాంగ్ కంటెంట్ ఉండొచ్చని..  ఖచ్చితంగా హిట్ సాధించే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు.  ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఒక మాంచి ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేశాడట డైరెక్టర్ అనిల్.  ఈ పాటకు మిల్కీ బ్యూటీని తీసుకున్నారని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే అంతా ఇప్పుడు తూచ్ అంటున్నారు.నిజానికి 'సరిలేరు నీకెవ్వరు' స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటివరకూ ఏ హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేయలేదట. అయితే ఈ పాటకోసం బ్యూటిఫుల్ పూజా హెగ్డేతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారట.  రెమ్యూనరేషన్ గట్రా ఒకే అయితే పూజతో కలిసి మహేష్ స్టెప్స్ వేయడం కన్ఫాం అవుతుంది. స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేయడం పూజాకు కొత్తేమీ కాదు.  గతంలో 'రంగస్థలం' సినిమాలో చరణ్ తో కలిసి 'జిగేలు రాణి' కి ఆడిపాడిన విషయం తెలిసిందే.  ఆ పాట సూపర్ హిట్ కూడా అయ్యింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో స్పెషల్ అవకాశం వస్తే నో చెప్పే అవకాశం దాదాపుగా ఉండదు.  ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.  విజయశాంతి.. ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.