ఫోటో స్టొరీ: అందాల ఫ్లడ్ గేట్లు ఎత్తేసిందే!

Fri Apr 19 2019 17:01:57 GMT+0530 (IST)

Pooja Hegde Glamorous Pic

పూజ హెగ్డే పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉంటారా? దాదాపుగా ఉండరు. ఒకవేళ నిజంగా ఉన్నారంటే వారు మహర్షులే.  ఆ మహర్షుల సంగతేమో కానీ ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  అంతే కాదు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ - సినిమాలో కూడా హీరోయిన్ తనే. అయితే ఈ భామకు సమ్మర్ టెంపరేచర్లు తక్కువగా ఉన్నాయనే అనుమానం వచ్చిందేమో కానీ ఈమధ్య తన హాటు ఫోటో షూట్లతో ఆ వేడిని మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది.రీసెంట్ గా ఈ భామ ఒక ఈవెంట్ కు హాజరయింది.  మామూలుగానే అందచందాల విందు చేస్తూ ఉండే డ్రెస్సులు ధరించే పూజ ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉంటే ఊరుకుంటుందా? ఊహు.. అస్సలు ఊరుకోదు.  యమా హాటుగా డ్రెస్సు ధరించింది.  నెట్ లాంటి క్లాత్ తో డిజైన్ చేసిన గౌన్ ధరించింది. భారీగా వీ నెక్ ఉండే డ్రెస్.. పైగా చాలా చోట్ల పారదర్శకంగా ఉంది. ఆ డిజైనర్..టైలర్ ఎవరో కానీ పెద్ద మనసుతో వీ- నెక్ ను పోలవరం డ్యామ్ అంత పెద్దదిగా ఉంచాడు. ఇంకేముంది అందాల ఫ్లడ్ గేట్లన్నీ ఒకేసారి ఎత్తేసినట్టుగా అయిపోయింది. దానికి తోడు పూజ కూడా ఒక ఖజురహో శిల్పంలా పోజిచ్చింది.. ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ పెట్టింది.

అంతా బాగుంది కానీ ఈ ఫోటోలో ఒకటే మైనస్.  పూజా హెగ్డే వెనక ఉన్న నీడ కూడా కనిపిస్తోంది.  ఈ లెక్కన ఈ ఫోటో తీసింది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాదనే  అర్థం.  ఒకవేళ ప్రొఫెషనల్ అయితే ఆ నీడ రాకుండా పూజ అందాలకు మాత్రం కెమెరాతో పూజ చేసి ఉండేవాడు.  ఏదైతేనేం పూజ అందాలకు పాత సినిమాటోగ్రాఫర్ల లాగా ఆకులు పువ్వులు అడ్డం పెట్టలేదు. అదే పదివేలు.  అసలే జిమ్ములో రెగ్యులర్ గా కఠినమైన కసరత్తులు చేస్తూ పూజ తన ఒంపుసొంపులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది. పూలను.. ఆకులను.. అస్తమిస్తున్న సూర్యుడిని అడ్డం పెడితే నెటిజనులు ఏమైపోవాలి?