Begin typing your search above and press return to search.

పూజా డేట్స్‌ ప్రభాస్‌.. అఖిల్‌ ల్లో ముందు ఎవరికి?

By:  Tupaki Desk   |   30 May 2020 4:30 AM GMT
పూజా డేట్స్‌ ప్రభాస్‌.. అఖిల్‌ ల్లో ముందు ఎవరికి?
X
పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో పాటు అక్కినేని అఖిల్‌.. బొమ్మరిల్లు భాస్కర్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా సగానికి పైగా పూర్తి అయ్యాయి. రెండు సినిమాల షూటింగ్స్‌ కూడా ఈ విపత్తు సమయంలో ఆగిపోయాయి. అతి త్వరలోనే మళ్లీ షూటింగ్స్‌ పున: ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ మరియు అఖిల్‌ ల మూవీలు ఒకేసారి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

రెండు సినిమాలు ఒకేసారి ప్రారంభం అయితే హీరోయిన్‌ పూజా హెగ్డే మొదటగా ఏ హీరోకు డేట్లు ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్స్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో పూజా హెగ్డేతో పాటు పలువురు హీరోయిన్స్‌ ముంబయి నుండి హైదరాబాద్‌ కు వచ్చేందుకు సిద్దం అవుతున్నారట. రెండు సినిమాలకు ఒకేసారి డేట్లు ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి ఉన్న కారణంగా తనను ఎవరు ముందు సంప్రదిస్తే వారికే డేట్లు ఇస్తానంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

షూటింగ్‌ ను ప్రారంభించి ఎవరు ముందుగా డేట్లు కావాలంటూ నన్ను సంప్రదిస్తారో వారికి డేట్లు ఇచ్చి ఆ తర్వాత మరో సినిమాకు ఇస్తాను. అంతకు మించి నేను ఏం చేయగలను అంటూ పూజా హెగ్డే కామెంట్‌ చేసింది. మరి ఈ అమ్మడిని ఎవరు ముందు సంప్రదిస్తారో చూడాలి. తెలుగులో రెండు సినిమాలు చేయడంతో పాటు బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు సినిమాకు కమిట్‌ అయ్యింది. అది కూడా త్వరలోనే ప్రారంభం అవ్వనుందని సమాచారం అందుతోంది.