Begin typing your search above and press return to search.

ఆ విషయం త్వరలో చెప్తానంటున్న పూజ హెగ్డే..

By:  Tupaki Desk   |   2 April 2020 11:30 PM GMT
ఆ విషయం త్వరలో చెప్తానంటున్న పూజ హెగ్డే..
X
ప్రస్తుతం వెండి తెరపై అందాల భామ పూజ హెగ్డే హవా నడుస్తోంది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న పూజ ఇటీవలే తన స్పీడ్ పెంచేసింది. 'అరవింద సమేత' - మహర్షిల భారీ విజయాల తర్వాత తన హిట్ల పరంపర కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అమ్మడి హవా ప్రస్తుతం ఊపు మీద ఉన్నట్లే అన్పిస్తుంది. ఎందుకంటే వరుస ప్రాజెక్ట్ లతో పూజ ఫుల్ బిజీ. ప్రస్తుతం అమ్మడి చేతిలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. అంతేగాక అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇంకా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న అమ్మడి కెరీర్ నక్క తోక తొక్కినట్లుగా మారింది. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. టాలీవుడ్ దర్శక నిర్మాతలే కాదు పూజ మీద కోలీవుడ్ - బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను పడిందట. తాజాగా అమ్మడు స్టార్ యాక్టర్ సూర్య సరసన అవకాశం కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక సల్మాన్ ఖాన్ పక్కన సోలో హీరోయిన్ గా నటిస్తుందంటే ఆమె రేంజ్ ఏమిటో అర్ధమవుతోంది. కానీ పూజ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన ఫాన్స్ కి ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న సినిమాల షెడ్యూల్స్ సరిచేసుకున్నాక నిర్ణయానికి వస్తానని అంటోంది. తప్పకుండా తమిళ సినిమా చేస్తాను కానీ ఎప్పుడో చెప్పలేనంది. అలా తనని లాక్ చేయాలని చుసిన వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ దెబ్బతో పూజ అభిమానులు త్వరలో ఏం కబురు చెప్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.