తమన్నాను క్రాస్ చేసిన పూజా.. నెం.3 స్థానం

Thu Apr 22 2021 10:09:51 GMT+0530 (IST)

Pooja Hegde Crossed Tamannah

టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా హెగ్డే మరియు రష్మిక మందన్నాల సందడి కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు. వీరిద్దరు టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా నిలిచారు. వీరిద్దరు టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. సినిమాల విషయంలో పోటీ పడుతున్న వీరు ఇద్దరు ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ విషయంలో మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. రష్మిక మందన్నా 16 మిలియన్ లతో ఇన్ స్టాగ్రామ్ లో దూసుకు పోతూ ఉంటే పూజా హెగ్డే మాత్రం 13.2 మిలియన్ ఫాలోవర్స్ వద్ద ఉంది. ఇటీవల కాలంలో ఈమె ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. కాని నెం.3 గానే నిలిచింది.మిల్కీ బ్యూటీ తమన్నా ఫాలోవర్స్ ను క్రాస్ చేసిన పూజా హెగ్డే ప్రస్తుతం సమంత మరియు రష్మికల తర్వాత స్థానంలో ఉంది. సమంత 16.4 మిలియన్ ల ఫాలోవర్స్ తో నెం.1 స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో రష్మిక 16 మిలియన్ లతో రెండవ స్థానంలో ఉంది. వీరిద్దరిని క్రాస్ చేయాలంటే పూజా హెగ్డేకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. రష్మిక మరియు సమంతలు జోరుగా దూసుకు పోతున్నారు. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. కనుక అక్కడ కనుక రష్మికకు సక్సెస్ లు దక్కితే ఖచ్చితంగా సమంతను క్రాస్ చేసేలా ఇన్ స్టా ఫాలోవర్స్ ను ఆమె దక్కించుకునే అవకాశం ఉంది.

పూజా హెగ్డే కూడా ప్రస్తుతం మోస్ట్ క్రేజీ మూవీస్ ల్లో నటిస్తుంది. ఆ సినిమాలు సక్సెస్ అయితే ఖచ్చితంగా సమంత ఫాలోవర్స్ వరకు చేరే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఇక నాల్గవ స్థానంలో ఉన్న తమన్నా చేతిలో పెద్దగా సినిమా లు లేకపోవడం వల్ల ఆమె జోరు కొనసాగక పోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ ముగ్గురు తెలుగు హీరోయిన్స్ దుమ్ము దులిపేస్తున్నారు.