ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో చాలా మంది ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
ఆ కారణంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున హరీష్ శంకర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ హీరో సినిమా అప్డేట్ ఇవ్వాలని కోరారు అయితే ప్రస్తుతానికి అప్డేట్ ఏం లేదని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఈయన పుట్టిన రోజు సందర్భంగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది.
ఆమె ట్విట్టర్ లో.. అత్యంత ఇష్టమైన దర్శకుల్లో ఒకడిగా హరీష్ శంకర్ ని పేర్కొంది. అంతే కాకుండా సెట్స్ లో ఉన్నప్పుడు హరీష్ శంకర్ చాలా ఉత్సాహంగా చమత్కారంగా ఉంటాడని కూడా పూజ పేర్కొంది. మీతో వర్క్ చేసినప్పుడు ఎప్పుడూ నీరసంగా ఉండదు. వ్యక్తిగతంగా ఉత్తమమైన వ్యక్తి మీరు అన్నట్లుగా పేర్కొంది.
అంతే కాకుండా ఈ సంవత్సరం మొత్తం మీకు మంచి జరగాలని ప్రార్థిస్తున్నట్లుగా పూజా హెగ్డే హరీష్ శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించమని అడిగిన సమయంలో డేట్లు ఖాళీ లేవు అంటూ నో చెప్పిందంట.
పవన్ కళ్యాణ్ అభిమానులు హరీష్ శంకర్ అడిగితే నో అని ఇప్పుడు ఎలా బర్త్ డే విషెస్ చెప్పావు అంటూ పోస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి డేట్ లో ఇవ్వలేనంత బిజీగా ఉన్నావా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయమై పూజ హెగ్డే ఎలా స్పందిస్తుందో చూడాలి.