Begin typing your search above and press return to search.

PS 2 ట్రైలర్: ట్విస్ట్ లో హై డ్రామా.. ఈసారైనా ఎక్కుతుందా?

By:  Tupaki Desk   |   30 March 2023 9:25 AM GMT
PS 2 ట్రైలర్: ట్విస్ట్ లో హై డ్రామా.. ఈసారైనా ఎక్కుతుందా?
X
మణిరత్నం దర్శకత్వంలో సినిమా అంటే అందులో ఇంటరెస్టింగ్ డ్రామా ఉంటుంది అని ప్రతి ప్రేక్షకుడు ఒక అంచనాకి వస్తారు. క్యారెక్టర్స్ లో కొత్తదనం లేకపోయిన బలమైన సంఘర్షణతో పాత్రల చిత్రణ ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా ఆడియన్స్ సీట్లకి అతుక్కుపోయేలా చేస్తుంది. ఎమోషనల్ కనెక్టివిటీతో ఎక్కువగా అయన సినిమాలు తెరకెక్కిస్తూ ఉండటం వలన ప్రేక్షకులకి భాగా రీచ్ అవుతాయి.

సౌత్ నుంచి మొదటిసారిగా బాలీవుడ్ లో సక్సెస్ అయిన దర్శకుడిగా మణిరత్నం గురించి చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ మూవీని గత ప్రేక్షకులకి అందించి హిట్ కొట్టారు. తమిళ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మల్టీ స్టారర్ చిత్రంగా ఆ మూవీ రిలీజ్ అయ్యింది. చోళులు, పల్లవుల మధ్య యుద్ద గొడవలు, రాజ్యంలో అంతర్గత వైరం నేపధ్యంలో ఈ మూవీ కథాంశం ఉంటుంది.

ఈ కంటెంట్ తెలుగు ఆడియన్స్ కి అంతగా తెలియకపోవడం వలన పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. తాజాగా పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ కి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 28న ఈ మూవీ రిలీజ్ కాబోతూ ఉండగా దీనికి సంబందించిన ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇక PS2 ట్రైలర్ చూసుకుంటే మొదటి సినిమా కంటే ఇంటరెస్టింగ్ గా ఉండటం విశేషం.

ఈ సారి ట్రైలర్ లో కేవలం డ్రామా మాత్రమే కాకుండా పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ని జోడించారు. కరికాల చోళుడుని చంపడానికి రాజ్యంలో జరిగే కుట్రలు, అరున్మణి చనిపోయాడు అని చోళరాజ్యంలో ప్రకటించడం. ఇక రాజ్యంలోని కుట్రలని తిప్పి కొట్టడానికి కరికాల చోళుడు చేసే పోరాటం, మరో వైపు రాజ్యంపై అదును చూసి ఎటాక్ చేయడానికి సిద్ధమైన పల్లవులని ఎదుర్కోవడానికి జరిగే పోరాటాలు.

ఇక ఆరున్మణి ఎంట్రీ ఇచ్చి పల్లవులతో తలపడటం ఇలా ఇంటరెస్టింగ్ ఘట్టాలు అన్ని కూడా PS2లో ఉన్నట్లుగానే ట్రైలర్ లో కనిపిస్తుంది. ఇక చోళ సామ్రాజ్య వినాశనం కోసం నందిని చేసే కుట్రలతో పల్లవులని రాజ్యంలోకి రప్పించడం లాంటి ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తి పెంచే విధంగా ఉన్నాయి.

పొన్నియన్ సెల్వన్ 2 కొనసాగింపుగానే వస్తున్న కూడా ఈ ట్రైలర్ తో మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో మణిరత్నం సక్సెస్ అయ్యాడు. తెలుగులో కూడా కూడా ఈ సారి ప్రేక్షకులకి చేరువ అయ్యేలానే పొన్నియన్ సెల్వన్ 2 మూవీ ట్రైలర్ ఉండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.