Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ చుట్టూ రాజకీయం… అసలు కథే ఇదే

By:  Tupaki Desk   |   3 Jun 2023 10:06 AM GMT
ఆదిపురుష్ చుట్టూ రాజకీయం… అసలు కథే ఇదే
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై విజువల్ ఫీస్ట్ గా ప్రేక్షకులకి చూపించబోతున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరిగింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత రామాయణంలోని పాత్రల చిత్రణని పూర్తిగా వక్రీకరించారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.

దీంతో ఆరు నెలల పాటు సినిమా అవుట్ పుట్ పై మరల వర్క్ చేసి ఇప్పుడు రిలీజ్ కి రెడీ చేశారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ని ఆద్యాత్మిక కోణంలో ఆవిష్కరించి విమర్శలకి కొంత వరకు ఫుల్ స్టాప్ అయితే పెట్టగలిగారు.

అయితే ఈ సినిమాని తమకి కచ్చితంగా చూపించాల్సిందే అని కొంతమంది హిందుత్వ సంఘాల వారు సెన్సార్ బోర్డుకి లేఖ రాసారంట. మరో వైపు ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరగనుంది. దీనికి చీఫ్ గెస్ట్ గా రాజమౌళి వస్తున్నారు. దాంతో పాటు ఏపీకి చెందిన రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

దీంతో పాటు రీసెంట్ గా నిర్మాత భూషణ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ సీఎం హిమాంత్ కుమార్ బిస్వాస్, మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రాని కలిసి ఆదిపురుష్ ట్రైలర్ ని చూపించారంట. గతంలో నరోత్తమ్ మిశ్రా ఆదిపురుష్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వారికి చూపించినట్లు తెలుస్తోంది.

ఇలా రాజకీయ ప్రముఖులకి సినిమా అవుట్ పుట్ చూపించడం వలన ఆదిపురుష్ కాంట్రవర్సీ పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటుగా రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలని చిత్ర యూనిట్ భావిస్తోందని టాక్ వినిపిస్తుంది. అందులో భాగంగా రాజకీయ ప్రముఖులని కలుస్తున్నారని తెలుస్తోంది.